Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆమె జననాంగంలోకి లాఠీ... నన్ను రేప్ చేస్తానన్నారు... ఇంద్రాణి షాకింగ్

ఇంద్రాణీ ముఖర్జియా అంటే ఒకప్పుడు అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో వుండేది. అలాంటిది తన కన్నకూతురును అత్యంత కిరాతకంగా హత్య చేయడంతో జైలు పాలయ్యారు. ఆ తర్వాత ఆమె విషయం కాస్త మరుగున పడిపోయింది. కానీ తాజా

Advertiesment
ఆమె జననాంగంలోకి లాఠీ... నన్ను రేప్ చేస్తానన్నారు... ఇంద్రాణి షాకింగ్
, బుధవారం, 28 జూన్ 2017 (20:29 IST)
ఇంద్రాణీ ముఖర్జియా అంటే ఒకప్పుడు అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో వుండేది. అలాంటిది తన కన్నకూతురును అత్యంత కిరాతకంగా హత్య చేయడంతో జైలు పాలయ్యారు. ఆ తర్వాత ఆమె విషయం కాస్త మరుగున పడిపోయింది. కానీ తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చింది. జైలు గోడల పైకి ఎక్కి నానా హంగామా చేస్తూ ఖైదీలతో కలిసి ఆందోళన చేయడంతో ఆమెను పోలీసులు చితక్కొట్టారనే ఆరోపణలు వచ్చాయి. 
 
ఆమె ప్రవర్తనపై మండిపడ్డ జైలు సిబ్బంది అవసరమైతే రేప్ చేస్తామని కూడా ఇంద్రాణిని భయపెట్టినట్లు ఆమె తరపు న్యాయవాది చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు పరిస్థితి అంతదాకా ఎందుకు వచ్చిందన్నది మరో ప్రశ్న. ఇదిలావుంటే ఇంద్రాణి శిక్ష అనుభవిస్తున్న బైకల్లా జైలులో 45 ఏళ్ల మంజురా అనే ఖైదీని జైలు సిబ్బంది చావబాదడమే కాకుండా ఆమె జననాంగంలోకి లాఠీని చొప్పించి అత్యంత దారుణంగా హింసించారన్న ఆరోపణలు వచ్చాయి. 
 
దాంతో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందిందని అంటున్నారు. దీనిపైన జైలులో వున్న ఖైదీలంతా ఒక్కసారిగా ఆందోళన చేశారు. వారితోపాటే ఇంద్రాణి కూడా కలిసి గొడవకు దిగారు. కాగా ఈ వ్యవహారంలో ఇప్పటికే జైలు అధికారులు నలుగురిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంద్రాణి ఆరోపణలపై కోర్టు విచారణ చేపట్టనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగుదేశం పార్టీ నుంచి పీవీ ప్రధాని అయ్యారట.. నారా లోకేష్ మళ్లీ నోరు జారారు..