Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

Advertiesment
Young Couple

సెల్వి

, శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (19:20 IST)
Young Couple
బెంగళూరులోని మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై రైలు ఎక్కడానికి వేచి ఉన్న యువ జంట పబ్లిక్‌గా రొమాన్స్ చేస్తూ కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది ఈ జంట ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రవర్తన బహిరంగ ప్రదేశానికి తగనిదని పేర్కొన్నారు. ఇలాంటి ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరారు.
 
ఈ సంఘటనకు సంబంధించి మెట్రో అధికారులు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.1.25 నిమిషాల వీడియోలో వృద్ధులు, పిల్లల సహా ఇతర ప్రయాణీకులు చుట్టుముట్టబడి ఉండగా యువ జంట అసభ్యకరమైన చర్యకు పాల్పడుతున్నట్లు చూపిస్తుంది. 
 
రైలు ఎక్కడానికి క్యూలో నిలబడి ఉన్న జంట, రొమాన్స్ చేస్తూ.. కనిపించాడు. కర్ణాటక పోర్ట్‌ఫోలియో ఎక్స్‌లో చేసిన ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు ఒక లక్ష మందికి పైగా వీక్షించారు. బెంగళూరు మెట్రో కూడా ఢిల్లీ మెట్రో సంస్కృతి మార్గంలోనే ఉందంటూ కామెంట్ చేశాడు. మెజెస్టిక్ నమ్మ మెట్రో స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ 3పై జరిగిన ఈ సంఘటన ప్రజలను దిగ్భ్రాంతికి, ఇబ్బందికి గురిచేసింది.
 
మెట్రో స్టేషన్ వంటి బహిరంగ ప్రదేశంలో ఇటువంటి చర్యలు పూర్తిగా ఆమోదయోగ్యం కాదనే విషయం తెలిసిందే. దీనిపై మెట్రో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒడిస్సీ 3D: భారతదేశపు మొట్టమొదటి గ్లాసెస్-రహిత 3D గేమింగ్ మానిటర్