దేశంలో కరోనా సెకండ్‌వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. వరుసగా ఐదోరోజు మూడు లక్షలకు చేరువలో కేసులు నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల్లో 2,73,810 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.
దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,50,61,919కి చేరింది. మరోవైపు మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం 1,619మంది కరోనాతో మరణించారు.
మొత్తం మరణాల సంఖ్య 1,78,769కి పెరిగింది. కొత్తగా 1,44,178మంది వైరస్ నుండి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,29,53,821కు చేరింది. రికవరీ రేటు 86.62శాతానికి తగ్గింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 19,29,329 కి పెరిగింది.