Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాహుల్ గాంధీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. తాళాలు మా చేతికి వచ్చాయి..

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. అయితే ఎవరు హ్యాక్ చేశారనేది తెలియరాలేదు. అయితే రాహుల్ అకౌంట్ హ్యాక్ అవడంపై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అవుతోంది. ఈ చర్య

Advertiesment
Congress Hacked On Twitter Hours After Abuses Posted On Rahul Gandhi Page
, గురువారం, 1 డిశెంబరు 2016 (11:10 IST)
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. అయితే ఎవరు హ్యాక్ చేశారనేది తెలియరాలేదు. అయితే రాహుల్ అకౌంట్ హ్యాక్ అవడంపై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అవుతోంది. ఈ చర్య ముమ్మాటికీ దిగజారుడు చర్య అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుర్జేవాలా విమర్శించారు. రాహుల్ గాంధీ పేదల స్వరంగా మారినందుకే ఇలా చేశారని ఆరోపించారు. 
 
రాహుల్ గాంధీకి ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి అభ్యంతరకర వ్యాఖ్యలు పెట్టారు. ''కాంగ్రెస్ పార్టీ ఈమెయిళ్లన్నీ బయటికి తెస్తున్నాం... క్రిస్మస్ స్పెషల్ కోసం చూస్తూనే ఉండండి'' అని హ్యాకర్లు పోస్టు చేశారు. దీంతోపాటు రాహుల్ గాంధీ ఎకౌంట్‌ను గురువారం మళ్లీ హ్యాక్ చేశారు. ఆయన ఖాతానుంచి ఉదయం 10:30కి సమయంలో మళ్లీ పోస్టులు పెట్టారు. దేశంలో డిజిటల్ సెక్యూరిటీ ప్రశ్నార్థకంగా మారిందనడానికి ఇదే నిదర్శనమని రాహుల్ గాంధీ విమర్శించారు.
 
దాదాపు 12 లక్షల మంది ఉన్న ఆయన ట్విట్టర్ ఖాతా నుంచి బుధవారం వరుసగా హ్యాకర్లు అభ్యంతరకర మెసేజ్‌లు పోస్టు చేసి కలకలం సృష్టించారు. ఓ ట్వీట్ ఆధారంగా ఈ హ్యాకింగ్‌కు పాల్పడిన వారిని 'లెజియన్' గ్రూప్‌గా అనుమానిస్తున్నారు. హ్యాకర్లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ''వారి తాళాలు మా చేతికి వచ్చాయి. మీరు నిజంగానే కేసు పెడదామనుకుంటున్నారా, హాఁ?'' అని హ్యాకర్లు ట్వీట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్.. ఫెంటాస్టిక్ ప్లేస్.. ఫెంటాస్టిక్ పీపుల్.. డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ :: షరీఫ్‌ ఫోన్