Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం పంపిన గిఫ్ట్‌లు చూసి షాక్ తిన్న ఎమ్మెల్యేలు..!

Advertiesment
సీఎం పంపిన గిఫ్ట్‌లు చూసి షాక్ తిన్న ఎమ్మెల్యేలు..!
, శుక్రవారం, 5 జులై 2019 (15:49 IST)
సాధారణంగా సీఎంగా ఉండే వ్యక్తిని ప్రసన్నం చేసుకోవడానికి ఎమ్మెల్యేలు మరియు ఇతర ముఖ్యమైన వ్యక్తులు అతని చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. కానీ ఓ రాష్ట్రంలో ఇందుకు భిన్నంగా సీఎంగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేలకు గిఫ్ట్ ఇచ్చారు. అది కూడా శాసనసభలో సుమా..! ఈ ఘట్టం బీహార్ అసెంబ్లీలో చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు సీఎం నితీష్ కుమార్ భలే వినూత్నమైన పని చేసారు. 
 
వ్యవసాయశాఖకు సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు కాబట్టి వెరైటీగా ఎమ్మెల్యేలందరికీ మామిడికాయలు, మామిడి మొక్కలను గిఫ్ట్‌గా పంపారు. అయితే ఈ వెరైటీ గిఫ్ట్ పట్ల ఎమ్మెల్యేలు వేర్వేరుగా స్పందిస్తున్నారు. సీఎం చేసిన పని భలే ఉందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు మెచ్చుకుంటున్నారు. ఇలా చేయడం సరికాదు అని విపక్షాలు తప్పుబడుతున్నాయి. 
 
బీహార్ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులు దారుణంగా తయారైయ్యాయని, మెదడు వాపు వ్యాధితో సుమారు 150 మంది పిల్లలు చనిపోయారని, అయితే అసెంబ్లీలో ఈ విషయాలపై చర్చ జరగకుండా సీఎం నితీష్ కుమార్ ఇలాంటి చీప్ పాలిట్రిక్స్ చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగారం ధరలు ఆకాశానికే... మహిళలు రూ.5000 ఓవర్‌డ్రాఫ్ట్ ఇందుకే ఉపయోగించాలేమో?