Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీబీఎస్ఈ ప్రశ్నపత్రం లీక్ : రూ.35 వేలకు తల్లిదండ్రుల కొనుగోలు

కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే సీబీఎస్ఈ గణితం (మ్యాథ్స్) ప్రశ్నపత్రం ఇటీవల లీక్ అయింది. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఉద్యోగులు అడ్డంగా అమ్మకానికి పెట్టారు.

సీబీఎస్ఈ ప్రశ్నపత్రం లీక్ : రూ.35 వేలకు తల్లిదండ్రుల కొనుగోలు
, శుక్రవారం, 30 మార్చి 2018 (17:29 IST)
కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే సీబీఎస్ఈ గణితం (మ్యాథ్స్) ప్రశ్నపత్రం ఇటీవల లీక్ అయింది. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఉద్యోగులు అడ్డంగా అమ్మకానికి పెట్టారు. దీంతో ఒక్కో పేపర్ రూ.35 వేల చొప్పున తల్లిదండ్రులు ఎగబడి కొనేశారు. అయితే, ఈ అమ్మకమంతా సవ్యంగా సాగిందినీ ఉద్యోగులు భావించారు. 
 
కానీ, ఈ గుట్టు దేశ వ్యాప్తంగా తెలియడానికి ప్రధాన కారణం విద్యార్థుల తల్లిదండ్రులేనని ప్రాథమిక విచారణలో తేలింది. ఒక్కో పేపర్‌ను రూ.35వేలకి కొనుగోలు చేసిన తల్లిదండ్రులు వాటిని జిరాక్స్ తీసి.. రూ.5 వేల చొప్పున మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులకు విక్రయించారు. ఇలా ప్రశ్నపత్రం వేలమందికి చేరిపోయింది. ఇలా వేలమందికి ఈ ప్రశ్నపత్రం చేరిపోవడంతో ఈ లీక్ వ్యవహారం రచ్చరచ్చగా మారింది. చివరికి వాట్సాప్ గ్రూప్స్‌లో చక్కర్లు కొట్టింది.
 
ఫలితంగా ఈ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నారు. ఈ లీక్ కారణంగా దేశవ్యాప్తంగా 16 లక్షల మంది విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెలవులకు వెళ్లిన పిల్లలు ఇప్పుడు మళ్లీ ఇంటి బాట పట్టారు. ఎంతో పకడ్బందీగా జరుగుతాయి అని చెప్పుకునే సీబీఎస్ఈలో కూడా ఇలాంటి అవకతవకలు జరగటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనా సీరియల్ కిల్లర్‌కు మరణశిక్ష