Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరెన్సీ కట్టలు, బంగారాన్ని రైలు బోగీలో తరలించిన పోలీస్.. బోగి సీజ్.. లైన్లోకి సీబీఐ

నల్ల కుబేరులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. నల్లధనాన్ని మార్పు చేసుకునేందుకు నల్ల కుబేరులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే ఓ డాక్టర్ రూ.70 లక్షలతో పట్టుబడిన నేపథ్యంలో.. మరో బ్లాక్ మనీ మోసగాడు.. ఉన్

Advertiesment
CBI raids ICF official's inspection carriage
, గురువారం, 17 నవంబరు 2016 (15:19 IST)
నల్ల కుబేరులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. నల్లధనాన్ని మార్పు చేసుకునేందుకు నల్ల కుబేరులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే ఓ డాక్టర్ రూ.70 లక్షలతో పట్టుబడిన నేపథ్యంలో.. మరో బ్లాక్ మనీ మోసగాడు.. ఉన్నత పోలీసు అధికారి బ్లాక్ మనీని తరలిస్తూ పట్టుబడిపోయాడు. పెద్ద ఎత్తున బంగారం, నగదును తీసుకెళ్ళేందుకు పోలీస్ అధికారి ప్లాన్ చేశాడు. ముందుగా సురక్షిత ప్రాంతానికి తరలించి.. తనకున్న అధికారంతో కరెన్సీ కట్టలు, బంగారాన్ని తరలించేందుకు రాజమార్గాన్ని ఎంచుకొన్నాడు.
 
ప్రత్యేక రైలు బోగిని బుక్ చేసుకుని.. ఆ బోగిలో బంగారం, నగదును తరలించేందుకు సన్నాహాలు చేశాడు. అయితే పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రానికి చెందిన పారి చెన్నైలో పనిచేస్తున్నాడు. ఐసిఎఫ్‌లో ఆయన భద్రతాధికారిగా పనిచేస్తున్నాడు. రైలులో ప్రత్యేక ఎసి బోగిని బుక్ చేసుకొన్నాడు. ఈ బోగిలో నగదును, బంగారం దొరికింది.
 
చెన్నైలోని ఎగ్మూర్ రైల్వేస్టేషన్‌లో ఈ రైలును నిలిపి గాలించగా బోగిలో నగదు, బంగారం ఉన్నట్టు గుర్తించారు. దీంతో సీబీఐ ఈ బోగిని సీజ్ చేశారు. బోగిలో నోట్ల కట్టలను, బంగారాన్ని తరలిస్తున్న రైల్వే భద్రతాధికారి వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డాక్టర్ వద్ద రూ.70లక్షలు ఎలా? అదీ రూ.100 నోట్లే.. షాకైన పోలీసులు