Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేవుడా.. చనిపోయిన కుక్క మాంసాన్ని తింటూ కనిపించిన వ్యక్తి.. ఎక్కడ?

Advertiesment
దేవుడా.. చనిపోయిన కుక్క మాంసాన్ని తింటూ కనిపించిన వ్యక్తి.. ఎక్కడ?
, శుక్రవారం, 22 మే 2020 (12:32 IST)
Rajasthan
కరోనా పేదల జీవితాన్ని కాటేసింది. కరోనా వైరస్ కారణంగా పేదలను ఆకలి వెంటాడుతోంది. పేదలకు ఆహారం లభించక నానా తంటాలు పడుతున్నారు. మింగ మెతుకు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఆకలితో వున్న వ్యక్తికి సంబంధించిన దారుణమైన దృశ్యం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఆకలికి తట్టుకోలేక రోడ్డుపై చనిపోయి కనిపించిన కుక్క మాంసాన్ని తింటూ కనిపించాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. జైపూర్ జిల్లా షాపురా వద్ద ఢిల్లీ - జైపూర్ జాతీయ రహదారిపై ఓ వ్యక్తి ప్రమాదంలో చనిపోయిన కుక్కను తింటూ ఆకలి తీర్చుకుంటూ కనిపించాడు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు దీన్ని గమనించారు. బాధితుడిని ప్రద్యుమ్న సింగ్ నరూకా అనే వ్యక్తి.. దీన్ని ఎందుకు తింటున్నావని ప్రశ్నించాడు. తినడానికి తిండి లేదని, ఆకలి తట్టుకోలేక ఇలా చేస్తున్నట్టు చెప్పాడు. వెంటనే తన వాహనంలో ఉన్న ఆహారం ప్యాకెట్‌ను ఇచ్చి అతడి ఆకలి తీర్చాడు. మరోసారి ఇలా కళేబరాన్ని తినకూడదని సూచించాడు. 
 
చాలా సేపటి నుంచి అతడు అలా రోడ్డుపై కుక్క మృతదేహాన్ని తింటూ ఉన్నా కనీసం ఎవరూ పట్టించుకోలేదని ఆ వ్యక్తి ఆవేదన చెందాడు. దీనికి సంబంధించిన వీడియోను ప్రద్యుమ్న షేర్ చేస్తూ.. ఇది మానవత్వానికే సిగ్గుచేటు అంటూ అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రాలో 62 పాజిటివ్ కేసులు - ఏమాత్రం తగ్గని ప్రభావం