Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆఫ్రికా దేశం కామెరూన్‌లో ప‌ట్టాలు త‌ప్పిన రైలు.. 55 మంది మృతి

ఆఫ్రికా దేశమైన కామెరూన్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 55 మంది దుర్మరణం పాలయ్యారు. మ‌రో 575 మంది గాయ‌ప‌డ్డారు. రాజ‌ధాని యోహోండ్ నుంచి పోర్ట్ న‌గ‌రం డౌలాకు వెళ్తోన్న ప్యాసింజ‌ర్ రైలు ఈ ప్ర‌మాదానిక

Advertiesment
ఆఫ్రికా దేశం కామెరూన్‌లో ప‌ట్టాలు త‌ప్పిన రైలు.. 55 మంది మృతి
, శనివారం, 22 అక్టోబరు 2016 (12:20 IST)
ఆఫ్రికా దేశమైన కామెరూన్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 55 మంది దుర్మరణం పాలయ్యారు. మ‌రో 575 మంది గాయ‌ప‌డ్డారు. రాజ‌ధాని యోహోండ్ నుంచి పోర్ట్ న‌గ‌రం డౌలాకు వెళ్తోన్న ప్యాసింజ‌ర్ రైలు ఈ ప్ర‌మాదానికి గురైంది.
 
ఇస్కా ప‌ట్ట‌ణ స‌మీపంలో ఇంట‌ర్ సిటీ రైలు ప‌ట్టాలు త‌ప్పింది. ప్ర‌మాద స‌మ‌యంలో భారీ శ‌బ్ధం వ‌చ్చిన‌ట్లు కొంద‌రు ప్ర‌యాణికులు తెలిపారు. రైలులో జ‌నం కిక్కిరిసిపోయి ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. సాధార‌ణంగా 600 మంది ప్ర‌యాణికుల‌తో వెళ్లే ఆ రైలులో ఘ‌ట‌న స‌మ‌యంలో 1300 మంది ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.
 
కామెరూన్‌లో ఇటీవ‌ల భారీ వ‌ర్షాలు కురిశాయి. దాని వ‌ల్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. దాంతో రోడ్ల‌ల‌న్నీ మూసుకుపోయాయి. ఆ కార‌ణంగా ట్రెయిన్లు అన్నీ భారీ జ‌నంతో కిక్కిరిసిపోతున్నాయి. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని అధికారులు అభిప్రాయ‌ప‌డ్డారు. రెస్క్యూ అధికారులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. రైలు బోగీల కింద చిక్కుకున్న వాళ్ల‌ను తొలిగిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుదుటపడుతున్న జయలలిత ఆరోగ్యం.. లండన్ డాక్టర్ వచ్చాక డిశ్చార్జ్