Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూపీలో ఓబీసీ లేదా దళిత వర్గానికి చెందిన నేతను సీఎం చేయాలి: సాక్షి మహరాజ్

దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించిన నేపథ్యంలో.. ఆ పార్టీ నేత సాక్షి మహరాజ్ సంచలన డిమాండ్ చేశారు. ఇప్పటికే సీఎం రేసులో ఉన్నట్లు రాజ్‌నాథ్-యోగి ఆదిత్యనాథ

యూపీలో ఓబీసీ లేదా దళిత వర్గానికి చెందిన నేతను సీఎం చేయాలి: సాక్షి మహరాజ్
, శనివారం, 11 మార్చి 2017 (12:50 IST)
దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించిన నేపథ్యంలో.. ఆ పార్టీ నేత సాక్షి మహరాజ్ సంచలన డిమాండ్ చేశారు. ఇప్పటికే సీఎం రేసులో ఉన్నట్లు రాజ్‌నాథ్-యోగి ఆదిత్యనాథ్ పేర్లు వినబడుతుంటే.. సాక్షి మాత్రం ఓబీసీ లేదా దళిత వర్గానికి చెందిన నేతను సీఎం చేయాలని  పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో సుమారు 20-22 శాతం మంది దళితులు ఉన్నారని, ఓబీసీలు 27 శాతం ఉన్నారని, వీరికి రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించాలని కోరారు. ఫలితాలను చూసి తానో స్లోగన్ చెప్పాలనుకుంటున్నట్లు చెప్పారు. 
 
''అబ్‌కీబార్‌ 300 పార్‌" అన్న సాక్షి మహరాజ్.. ఈసారి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించేందుకు ముందుకెళ్తున్నామన్నారు. ఇంకా పూర్తి కాని మెట్రో, ఎక్స్‌ప్రెస్‌వేలను అఖిలేష్‌ యాదవ్‌ యుద్ధప్రాతిపదికన ప్రారంభించినప్పుడే ఎస్పీ ఓటమి ఖాయమని తేలిపోయింది. కాంగ్రెస్‌తో జతకట్టగానీ ఆయన ఓటమి ఖాయమని మరోమారు రూడీ అయిందని సాక్షి మహరాజ్ వ్యాఖ్యానించారు. ఈ ఫలితాల దెబ్బకు యూపీలో బలమైన ప్రతిపక్షం కూడా లేకుండా పోయిందని సాక్షి మహరాజ్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంజాబ్ కోట కాంగ్రెస్ హస్తగతం : ముఖ్యమంత్రిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ?