2019 ఎన్నికలు.. ఏపీలో మూడు ముక్కలాట.. తెలంగాణలో కేసీఆరే టార్గెట్.. జనసేన, బీజేపీ పక్కా ప్లాన్?
2019 ఎన్నికలపై తెలుగు రాష్ట్రాలు టార్గెట్ చేశాయి. ఇప్పటికే ఎన్నికలపై దృష్టి పెట్టాయి. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు జోరుగా మారుతున్నాయి. ఏపీలోనూ ఎన్నికలను టార్గెట్ చేస్తూ.. వైకాపా, టీడీపీ, బీజేపీ, పవన్ జ
2019 ఎన్నికలపై తెలుగు రాష్ట్రాలు టార్గెట్ చేశాయి. ఇప్పటికే ఎన్నికలపై దృష్టి పెట్టాయి. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు జోరుగా మారుతున్నాయి. ఏపీలోనూ ఎన్నికలను టార్గెట్ చేస్తూ.. వైకాపా, టీడీపీ, బీజేపీ, పవన్ జనసేన పనిచేస్తున్నాయి. ఇదే తరహాలో తెలంగాణలోనూ 2019 ఎన్నికలే లక్ష్యంగా.. కేసీఆర్ నాయకత్వాన్ని దెబ్బతీసే దిశగా మిగిలిన పార్టీలు సమాయత్తమవుతున్నాయి.
ఇందులో భాగంగా రెండేళ్ల పాటు గడువు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే గెలుపు గుర్రాల కోసం బీజేపీ గాలం వేస్తోంది. ఇందుకోసం టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో బలమైన నాయకులకు గాలం వేస్తున్నట్లు సమాచారం. హైదరాబాదుతో పాటు తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో బలమైన నాయకుల కోసం బీజేపీ అన్వేషణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. కొత్త నాయకత్వ సమీకరణాలతో కేసీఆర్ పార్టీకి గట్టిదెబ్బ కొట్టాలని బీజేపీ భావిస్తోంది.
అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం జనసేన పార్టీని తెలంగాణలో బలోపేతం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జనసేన పార్టీకి తెలంగాణలో విప్లవ గాయకుడు గద్దర్ తెలంగాణలో నాయకత్వం వహించి, వామపక్షాలను ఏకతాటి మీదికి తెచ్చే ప్రయత్నంలో గద్దర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో మంచి పట్టున్న సినీ నటి విజయశాంతిని రంగంలోకి దించేందుకు బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది.
ఇక ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్‌గా పనిచేసిన కాంగ్రెస్ నేత సురేష్ రెడ్డికి కూడా బీజేపీ గాలం వేస్తున్నట్లు సమాచారం. మరి తెలంగాణలో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడుతారో తెలియాలంటే వేచి చూడాలి. ఏపీలో మాత్రం మూడు ముక్కలాట వుంటుందని.. టీడీపీ, వైకాపా, జనసేనల మధ్య తీవ్రంగా పోటీ ఉంటుందని సమాచారం.