Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బార్‌లో డ్యాన్స్.. పురుషులతో సంబంధాలు.. భార్యను కత్తితో పొడిచేశాడు.. ఆపై సూట్‌కేసులో?

పశ్చిమ బెంగాల్, ఉల్కాస్ నగరంలోని ఓ బార్‌లో డ్యాన్స్ చేసే భార్యకు అనేకమంది పురుషులతో శారీరక సంబంధాలున్నట్లు తెలుసుకున్న భర్త ఆమెను కత్తితో పొడిచి హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. ఉల్కాస్ నగరానికి సమీపం

Advertiesment
Bar-Girl Killed By Husband
, గురువారం, 24 నవంబరు 2016 (14:39 IST)
పశ్చిమ బెంగాల్, ఉల్కాస్ నగరంలోని ఓ బార్‌లో డ్యాన్స్ చేసే భార్యకు అనేకమంది పురుషులతో శారీరక సంబంధాలున్నట్లు తెలుసుకున్న భర్త ఆమెను కత్తితో పొడిచి హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. ఉల్కాస్ నగరానికి సమీపంలో విదల్వాడి ప్రాంతానికి చెందిన రాజేష్ ఖాన్ భార్య జమీలా. ఈమె ఆ ప్రాంతానికి చెందిన ఓ బారులో డ్యాన్స్ చేస్తూ కాలం గడిపేది. ఇలా బార్‌లో డ్యాన్స్ చేసే జమీలాకు పలువురు పురుషులతో సంబంధాలు ఏర్పడ్డాయి. 
 
బారులో డ్యాన్స్ చేసేందుకు వెళ్ళొద్దని.. వెళ్ళాలనుకుంటే డ్యాన్స్ చేసేంతవరకే పరిమితం కావాలని భర్త రాజేష్ ఎంత చెప్పినా జమీలా పట్టించుకోలేదు. ఈ వ్యవహారంపై భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. గొడవ జరిగేది. ఇలా ఓ రోజు భార్యాభర్తల మధ్య జరిగిన తగాదానే జమీలా హత్యకు దారితీసింది. చెప్పిన మాట వినకుండా తప్పుడు మార్గంలో వెళ్తున్న భార్యను రాజేష్ కత్తితో పొడిచి చంపేశాడు. ఆపై ఆమె మృతదేహాన్ని సూట్ కేసులో భద్రపరిచాడు. జమీలా మృతదేహాన్ని తరలించేందుకు స్నేహితుడు సబీబుల్లా సహాయం కోరాడు. 
 
అయితే జమీలా హత్యతో షాక్ తిన్న సబీబుల్లా.. పోలీసులకు సమాచారం అందించాడు. అప్పటికే పరారైన రాజేష్ ఖాన్‌ను సెల్ ఫోన్ టవర్ ఆధారంగా అరెస్ట్ చేశారు. జమీలా మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఆ బిల్లు మాదికాదు... రిలయన్స్ జియో