Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియురాలి ప్రేమ కోసం మర్మాంగం, నాలుక బలి... వశీకరా...

ప్రేమ పిచ్చి ముదిరింది. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందన్నట్లుగా ప్రేమ ముదిరి మూఢుడిగా మారిపోయాడతడు. ప్రేమికురాలని పొందాలంటే అమ్మవారికి తన నాలుక, మర్మాంగాన్ని సమర్పించుకుంటే దక్కుతుందన్న నమ్మకంతో ఆ పని చేసేశాడు. మరి అతను అనుకున్నది నెరవేరిందా...? వివ

Advertiesment
ప్రియురాలి ప్రేమ కోసం మర్మాంగం, నాలుక బలి... వశీకరా...
, సోమవారం, 20 మార్చి 2017 (12:21 IST)
ప్రేమ పిచ్చి ముదిరింది. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందన్నట్లుగా ప్రేమ ముదిరి మూఢుడిగా మారిపోయాడతడు. ప్రేమికురాలని పొందాలంటే అమ్మవారికి తన నాలుక, మర్మాంగాన్ని సమర్పించుకుంటే దక్కుతుందన్న నమ్మకంతో ఆ పని చేసేశాడు. మరి అతను అనుకున్నది నెరవేరిందా...? వివరాలు చూస్తే... ఒరిస్సాకు చెందిన బిజు కుమార్ అనే యువకుడు తమ సొంత గ్రామంలో ఓ యువతిని ప్రేమించాడు. బిజు కుమార్ ప్రేమను సదరు యువతి తిరస్కరించింద. దానితో దేవదాసులా మద్యానికి బానిసైపోయాడు. '
 
ఇక ఇక్కడుంటే లాభం లేదనుకున్న అతడి తల్లిదండ్రులు అతడిని బెంగళూరులోని తమ బంధువుల వద్దకు పంపారు. ఈ క్రమంలో అతడు ఇక్కడ కొంతమంది యువకులతో స్నేహం ఏర్పరుచుకున్నాడు. వారంతా పశ్చిమబెంగాల్‌కు చెందినవారు. వారితో తన ప్రేమ విషయం చెప్పడంతో వారు ఇతడికి ఓ సలహా ఇచ్చారు. 
 
ప్రేమ ఫలించి ప్రియురాలు దక్కాలంటే నాలుక, మర్మాంగాన్ని అమ్మవారికి సమర్పిస్తే అనుకున్నది నెరవేరుతుందని చెప్పారు. తద్వారా ప్రియురాలు దక్కుందని చెప్పడమే కాకుండా వశీకరణ విద్య కూడా వచ్చేస్తుందని చెప్పారు. దాంతో ప్రియురాలి కోసం చాకు తీసుకుని తన నాలుకను, మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. 
 
ఐతే నాలుక, మర్మాంగం కోసేసుకున్న తర్వాత శక్తులు కాదు కానీ ఒంట్లో శక్తంతా పోతుండటంతో భయమేసి తన బంధువులకు తనను ఎవరో కిడ్నాప్ చేసి నాలుక, మర్మాంగం కోశారంటూ విషయం చెప్పాడు. అతడిని ఆసుపత్రిలో చేర్పించిన సదరు బంధువులు విషయాన్ని పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఐతే పోలీసు దర్యాప్తులో ఎలాంటి క్లూ లభించకపోవడంతో బిజు వద్దనే పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఏం జరిగిందో చెప్పకపోతే... తమదైన శైలిలో దర్యాప్తు సాగుతుందని చెప్పడంతో నిజాన్ని చెప్పేశాడు బిజు. తను ప్రేమించిన అమ్మాయిని వశం చేసుకునేందుకే ఇలా నాలుక, మర్మాంగం కోసేసుకున్నట్లు అంగీకరించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకాకు చుక్కెదురు.. టీడీపీ రవి రికార్డు విజయం