Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తన ఊరివాడే అని ఆదరిస్తే.. అత్యాచారం చేసి బండరాయితో కొట్టి చంపాడు..

దక్షిణ కర్నాటక రాష్ట్రంలో ఓ నేపాలీ మహిళ అత్యాచారం, హత్య కేసులో సరికొత్త కోణం వెలుగు చూసింది. తన ఊరివాడే అని దగ్గరకు చేరదీసిన మహిళపై ఓ ఎలక్ట్రీషియన్ అత్యాచారం చేసి.. తలపై బండరాయితో కొట్టి చంపాడు. తాజాగ

Advertiesment
తన ఊరివాడే అని ఆదరిస్తే.. అత్యాచారం చేసి బండరాయితో కొట్టి చంపాడు..
, శుక్రవారం, 19 మే 2017 (12:59 IST)
దక్షిణ కర్నాటక రాష్ట్రంలో ఓ నేపాలీ మహిళ అత్యాచారం, హత్య కేసులో సరికొత్త కోణం వెలుగు చూసింది. తన ఊరివాడే అని దగ్గరకు చేరదీసిన మహిళపై ఓ ఎలక్ట్రీషియన్ అత్యాచారం చేసి.. తలపై బండరాయితో కొట్టి చంపాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
సౌత్ కర్నాటకలోని బనశంకరి, సర్జాపురలో నేపాల్‌కు చెందిన పవిత్ర (20) అనే మహిళ తన భర్తతో కలిసి నివశిస్తోంది. ఈమెకు నేపాల్‌కు చెందిన కరణ్‌ తిలక్ అనే యువకుడితో రెండేళ్లక్రితం పరిచయమైంది. ఇద్దరూ నేపాల్ దేశస్థులు కావడంతో పవిత్ర ఇంటికి కరణ్ వచ్చి వెళ్తూవుండేవాడు.
 
ఈ క్రమంలో తాను ఇబ్బందుల్లో ఉన్నానంటూ అతడు ఆమె నుంచి పలుమార్లు డబ్బు అప్పుగా తీసుకున్నాడు. ఆమె తిరిగి అడిగినా అతడు చెల్లించలేదు. దీంతో అతన్ని అందరి ముందు నిలదీసింది. దీన్ని అవమానంగా భావించిన కరణ్... డబ్బులిస్తానని ఆమెను రహస్యప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి బండరాయితో తలపై మోది హత్యచేశాడు. 
 
ఆమె కనిపించకపోవడంతో సెక్యూరిటీ గార్డుగా పని చేసే భర్త కరణ్‌ సర్జాపుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానంతో తిలక్‌‌ను మంగళవారం అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారణ చేపట్టడంతో హత్యవిషయం వెలుగులోకి వచ్చింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్యచేసినట్లు తిలక్‌ అంగీకరించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ మంత్రులను పక్కనబెట్టిన చంద్రబాబు... టీడీపీ - బీజేపీ మైత్రి చెడినట్టేనా?