Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుమార్తె వరుసైన యువతిపై అత్యాచారం... సహకరించిన కన్నతల్లి

Advertiesment
Bangalore
, సోమవారం, 13 జులై 2020 (09:05 IST)
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో దారుణం జరిగింది. వరుసకు కుమార్తె అయిన 20 యేళ్ళ యువతిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకానికి పాల్పడటానికి ఆమె కన్నతల్లి పూర్తిగా సహకరించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరులోని అరెకెరె‌కు చెందిన రీమా అనే మహిళ కొన్నేళ్ళ క్రితం భర్తతో విడాకులు తీసుకుంది. ఈమెకు 20 యేళ్ళ కుమార్తె ఉంది. వీరిద్దరూ కలిసి జీవిస్తూ వచ్చారు. ఈ క్రమంలో రీమాకు అలెగ్జాండర్ దాస్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. ఈయన భవన నిర్మాణ కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో రీమా మొదటి భర్త కుమార్తెపై కన్నుపడింది. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్లాన్ వేశాడు. వావి వరుసలు మరిచిపోయాడు. వరుసకు కుమార్తె అని తెలిసినా అవేమీ పట్టించుకోలేదు.
 
పైగా, కుమార్తె వరుసైన యువతిపై తన భర్త కన్నేసిన విషయం తెలుసుకున్న రీమా అతడికి సహకరించింది. టీ, ఇతర ఆహార పదార్థాల్లో నిద్రమాత్రలు కలిపి కుమార్తెకు ఇచ్చేది. అవి తీసుకుని నిద్రమత్తులోకి జారిపోయిన అనంతరం దాస్ ఆమెపై అత్యాచారానికి పాల్పడసాగాడు. యేడాదిన్నర క్రితం ఓ పని కోసం యువతిని హైదరాబాద్ తీసుకొచ్చిన దాస్ హోటల్ గదిలో మద్యం తాగించి స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారానికి తెగబడ్డాడు.  
 
తనపై జరుగుతున్న లైంగిక దాడిని ప్రశ్నించిన యువతి మొబైల్ లాక్కుని కాలేజీకి వెళ్లొద్దని హుకుం జారీ చేసిన దాస్.. ఈ విషయాన్ని బయటపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. దీంతో ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయిన బాధితురాలు తాజాగా హుళిమావు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
అంతేకాదు, తనను కాలేజీ మాన్పించిన నిందితుడు అశ్లీల వీడియోలు తీయాలని, మోడలింగ్ చేయాలని వేధించేవాడని, అతడి దారుణాలకు తన తల్లి కూడా సహకరించిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితులు కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియాంక చోప్రాకి అరుదైన గౌరవం