బెంగుళూరులో గ్యాంగ్ రేప్ : నోట్లో గుడ్డలు కుక్కి... చేతులు కట్టేసి కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం
బెంగుళూరులో మరో గ్యాంగ్ రేప్ జరిగింది. కాలేజీకి వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఓ యువతిని.. ఆటో డ్రైవర్‌తో పాటు అతని స్నేహితులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆటో దారి మళ్లించి... నోట్లో గుడ్డలుకుక్క
బెంగుళూరులో మరో గ్యాంగ్ రేప్ జరిగింది. కాలేజీకి వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఓ యువతిని.. ఆటో డ్రైవర్‌తో పాటు అతని స్నేహితులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆటో దారి మళ్లించి... నోట్లో గుడ్డలుకుక్కి... చేతులు కట్టేసి అత్యాచారానికి తెగబడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
బెంగళూరుకు చెందిన ద్వితీయ పియుసి చదివే ఓ విద్యార్థిని ఏదో వ్యక్తిగత పనిమీద బెంగళూరు నుంచి రైలులో షిమోగాకకు వచ్చింది. ఆ తర్వాత సహ్యాద్రి కాలేజీకి వెళ్ళేందుకు ఆటో మాట్లాడుకుంది. ఆటో డ్రైవర్ షారూఖ్ కొద్దిదూరం వెళ్ళాక దారి మళ్ళించాడు. కొంతదూరం వెళ్లాక ఆటోలో మరో ఇద్దరు అతని స్నేహితులు ఎక్కించుకున్నాడు.
వీరు ఆటో ఎక్కుతుంటే ఆ యువతి అభ్యంతరం చెప్పగా, దారిలో దిగేస్తారని బదులిచ్చారు. ఆ తర్వాత కొద్దిదూరం వెళ్ళాక విద్యార్థిని బెదిరించి నోట్లో గుడ్డలు కుక్కి చేతేలు కట్టేసి అత్యాచారానికి ఒడిగట్టారు. మొత్తం ఆరుగురు ఈ సామూహిక అత్యాచారంలో పాల్గొన్నారని ఎస్పీ వివరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నలుగురు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.