Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పసుపు బుడగలపై మోడీకి హెచ్చరికలు.. జాతిపితకు నివాళులు అర్పించిన మోడీ..

భారత్-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న సమయంలో సరిహద్దు ప్రాంతం పంజాబ్‌లోని దినానగర్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని హెచ్చరిస్తూ బుడగలు కలకలం సృష్టించాయి. అవి మోడీని ఉర్దూలో హెచ్చరి

Advertiesment
Balloons with message for PM Modi in Urdu found in Punjab’s Gurdaspur district
, ఆదివారం, 2 అక్టోబరు 2016 (09:19 IST)
భారత్-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న సమయంలో సరిహద్దు ప్రాంతం పంజాబ్‌లోని దినానగర్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని హెచ్చరిస్తూ బుడగలు కలకలం సృష్టించాయి. అవి మోడీని ఉర్దూలో హెచ్చరిస్తూ రెండు బుడగలు కనిపించాయి. ''మోదీజీ.. అయుబ్‌ (పాకిస్థాన్‌ మాజీ ప్రధాని) వదిలిన కత్తులు ఇప్పటికీ మా దగ్గరే ఉన్నాయి. ఇస్లాం జిందాబాద్‌ (మోదీజీ అయుబ్‌ కి తల్వారీ అభీ హమారే పాస్‌ హై. ఇస్లాం జిందాబాద్‌)'' అంటూ పేపర్‌పై రాసి పసుపు రంగులోని బుడగలపై అతికించారు. వీటిని దినానగర్‌లోని ఘేసల్‌ గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
 
ఇదిలా ఉంటే అక్టోబర్ 2 (నేడు) జాతిపిత మహాత్మా గాంధీ 147వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ  నివాళులర్పించారు. అలాగే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ నాయకులు గాంధీ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించారు. అలాగే మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, వివిధ పార్టీల నేతలు నివాళులర్పించారు.
 
ఇంకా గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రజలు ఖాధీ వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపు నిచ్చారు. ఆదివారం మన్ కీ బాత్ మాట్లాడుతూ.. పేదలు అత్యధికంగా ఉన్న ఖాదీ రంగంలో ఉన్నారని వారిని ప్రోత్సహించేందుకు స్వదీశీ వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. మహాత్మా గాంధీ 192 లో ఖాదీ ఉద్యమాన్ని ప్రారంభించారని మోడీ గుర్తు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలిత కోలుకుంటున్నారు... తమిళనాడు రాజ్ భవన్ నుంచి ప్రకటన విడుదల...