దేశంలో కరోనా నేపథ్యంలో నాలుగు నెలలుగా ప్రయాణీకులకు దూరంగా వున్న రైళ్లు మరికొద్ది కాలం.. స్టేషన్లకే పరిమితమవడం ఖాయమైపోయింది. సెప్టెంబర్ 30 వరకు అన్ని సాధారణ రైళ్లను రద్దు చేస్తున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది.
మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ రైళ్ల సేవలను నిలిపివేస్తున్నట్లు అన్ని జోనల్ రైల్వేలకు ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఈ సేవలను ఆగస్ట్ 12 వరకు రద్దు చేస్తున్నట్లు జూన్ 25న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ గడువు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో తాజాగా మరోసారి రైల్వే సేవల రద్దు నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే, లాక్‌డౌన్ సమయంలో ప్రయాణికులకు సేవలు అందించేందుకు ప్రారంభించిన ప్రత్యేక రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు, ఇతర రైళ్ల సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.