ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయి ఇటీవల బెయిలుపై విడుదలైన బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ వద్ద నార్కాటిక్స్ కంట్రోల్ బ్యూరో శుక్రవారం మరోమారు విచారణ జరిపింది. ఇందుకోసం ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ ఎదుట హాజరయ్యారు.
ఇటీవల ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే, ప్రతి శుక్రవారం ఎన్సీబీ విచారణకు హాజరవ్వాలన్న షరతు విధించింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ ఎదుట హాజరయ్యాడు.
రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ముంబై నుంచి గోవా వెళ్తున్న ఒక నౌకపై ఎన్సీబీ అధికారులు అక్టోబరు నెల 2వ తేదీన రెయిడ్ చేశారు. అక్కడ ఆర్యన్‌తోపాటు అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ ధమేచా సహా పలువురు ప్రముఖులు కూడా దొరికిపోయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత బెయిల్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనకు బెయిల్ మంజూరు కాలేదు. దీంతో ముంబై హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడ బెయిల్ లభ్యమైంది.