Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా.. తదుపరి సీఎం ఎవరు?

Arvind Kejriwal

ఠాగూర్

, మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (09:04 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిర్దోషినని నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో కొనసాగబోనని, రెండు రోజుల్లో పదవికి రాజీనామా చేస్తానంటూ రెండు రోజుల క్రితం కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఇపుడు రాజీనామాకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు. 
 
కేజ్రివాల్ ఈ రోజు (సోమవారం) లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అపాయింట్మెంట్ కోరారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు సమయం ఇస్తున్నట్టు వీకే సక్సెనా కార్యాలయం సమాచారం ఇచ్చింది. దీంతో రేపు లెఫ్టినెంట్ గవర్నరుతో భేటీ సందర్భంగా కేజీవాల్ తన రాజీనామా లేఖను సమర్పించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 
మరోవైపు ఢిల్లీ సీఎం పదవీకాలం ముగియడానికి కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ప్రజాదరణ, పార్టీలో మంచి పేరున్న వ్యక్తిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని ఆప్ నాయకత్వం యోచిస్తోంది. సీఎం రేసులో ప్రముఖంగా ఐదుగురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ... కేజీవాల్, మనీశ్ సిసోడియా జైలులో ఉన్నప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని చక్కబెట్టిన మహిళా మంత్రి అతిషి పేరు సీఎం రేసులో ఎక్కువగా వినిపిస్తోంది.
 
కాగా, ఆదివారం మధ్యాహ్నం ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం కేజ్రివాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. తనను జైలుకు పంపి, ఆప్ చీలికలు తీసుకురావాలని ప్రయత్నించారని, తద్వారా ఢిల్లీ పీఠం చేజిక్కించుకోవాలని భావించారని బీజేపీని ఉద్దేశించి ఆరోపించారు. ఎన్ని కుట్రలు పన్నినా ఆపన్ను విచ్ఛిన్నం చేయలేకపోయారని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాలనే ఇన్నాళ్లు రాజీనామా చేయలేదని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో కంప్యూటర్లను ప్రవేశపెట్టింది రాజీవ్‌గాంధీనే: రేవంత్ రెడ్డి