Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరుణాచల్ ప్రదేశ్ సీఎం అదుర్స్.. ఎవరూ చేరుకోలేని చోటుకు జర్నీ (video)

Advertiesment
అరుణాచల్ ప్రదేశ్ సీఎం అదుర్స్.. ఎవరూ చేరుకోలేని చోటుకు జర్నీ (video)
, సోమవారం, 29 మార్చి 2021 (18:13 IST)
Pema Khandu
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫెమా ఖండు ఇంత వరకూ ఏ ముఖ్యమంత్రి చేరుకోని ప్రాంతానికి వెళ్లి సాహసం చేశారు. క్లిష్టమైన సీఎం జర్నీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. తూర్పు అరుణాచల్‌లోని విజయనగర్‌ను సందర్శించారు. ఇది భారతదేశం-మయన్మార్ సరిహద్దు ప్రాంతం.. ఒక మహీంద్రా థార్‌లో ఉంది. 
 
ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రి కూడా చేరుకోని.. ఈ మారుమూల కొండ ప్రాంతానికి వెళ్లి అందరి మన్ననలు పొందుతున్నారు ఖండూ. మంత్రులు, ఎంపీల నుంచి ఎమ్మెల్యేల వరకు, పంచాయతీ ప్రతినిధులు కూడా ఎవరూ చేరుకోలేని చోటుకు చేరుకుని దాదాపు రెండురోజుల పాటు 157 కిలోమీటర్లు ప్రయాణించి చాంగ్ లాంగ్ జిల్లాలోని మయన్మార్ సరిహద్దు ప్రాంతం విజయనగర్ చేరుకున్నారు. 
 
ఈ ప్రయాణంలో ఆయన వెంట క్యాబినెట్ మంత్రులు కమ్లుంగ్ మొసాంగ్, హోంచన్, పలువురు ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. అక్కడకు చేరుకున్న సీఎం పెమాఖండు విజయనగర్ ప్రాంత వాసులకు వరాలజల్లు కురిపించారు. 
 
ఈ ప్రాంతానికి రోడ్డు నిర్మిస్తానని, రహదారి నాణ్యతను అంచనా వేయడానికి ఈ ప్రయాణం చేపట్టినట్లు చెప్పారు. 2022 మార్చి నాటికి రోడ్డు మార్గాన్ని రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు. నిర్మాణ పనులు సకాలంలో పూర్తయ్యేలా చూసేందుకు తాను వ్యక్తిగతంగా ఈ ప్రయాణాన్ని చేపట్టినట్లు సీఎం వెల్లడించారు.  

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయసాయి రెడ్డికి ఘాటు కౌంటర్ వేసేసిన భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు