కరోనా వైరస్ పై పోరాడుతున్న వేళ తబ్లిగ్ జమాత్ సమావేశాలు నిర్వహించడం నేరమని, సర్వశక్తిసంపన్నుడు అయిన అల్లాహ్ కూడా దీన్ని క్షమించడని, వారి అజాగ్రత్తల వల్ల చాలామంది ప్రాణాలు ప్రమాదంలో పడటం దురదృష్టకరమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి ముక్తార్ అబ్బాస్ వ్యాఖ్యానించారు.
దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ మార్చి 13 నుంచి 15వతేదీ వరకు ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లీగ్ జమాత్ సమావేశాలు నిర్వహించడం తాలిబాన్ నేరానికి తక్కువ కాదని, దీనిపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని మంత్రి నఖ్వీ కోరారు.
దేశంలో కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు మైనారిటీలతో సహా ప్రజలు మద్ధతు ఇస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
కరోనా ప్రబలకుండా శుక్రవారం నమాజ్ మసీదుల్లో చేయరాదని, వారి వారి ఇళ్లలోనే చేయాలని ముస్లిములందరూ స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.