Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 14 January 2025
webdunia

అయోధ్యకు బెంగుళూరు - కోల్‌కతాల నుంచి డైరెక్ట్ విమాన సర్వీసులు

Advertiesment
air express
, శనివారం, 30 డిశెంబరు 2023 (09:11 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరానికి కోల్‌కతా, బెంగుళూరు నగరాల నుంచి డైరెక్ట్ విమాన సర్వీసులను నడుపనుంది. ఈ విమాన సర్వీసులు జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. అయోధ్యలో కొత్తగా నిర్మించిన వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును కూడా ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించి, ఆ తర్వాత అయోధ్య - ఢిల్లీల మధ్య నడిపే విమాన సర్వీసును ఆయన ప్రారంభిస్తారు. 
 
ఇదిలావుంటే, అయోధ్య - బెంగుళూరు, అయోధ్య - కోల్‌కతా ప్రాంతాల మధ్య జనవరి 17 నుంచి సర్వీసులను ప్రారంభిస్తామని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ శుక్రవారం తెలిపింది. ఈ రూట్లలో నాన్ స్టాప్ విమానాలను ప్రవేశపెట్టనున్నామని, తద్వారా అయోధ్యకు కనెక్టివిటీ గణనీయంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. తమ నెట్ వర్క్‌లో బెంగళూరు, కోల్‌కతా నగరాలు అయోధ్యకు గేట్ వేలుగా ఉంటాయని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ డాక్టర్ అంకుర్ గార్గ్ అన్నారు. 
 
దేశంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల నుంచి అయోధ్యకు వెళ్లే యాత్రికులకు ఇక్కడ నుంచి వన్-స్టాప్ ప్రయాణాలు చేయొచ్చని సూచించారు. ఎయిర్‌ లైన్ మొబైల్ యాప్, వెబ్‌సైట్స్, ఇతర బుకింగ్ ప్లాట్‌ఫామ్స్ మీద టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది. కాగా అయోధ్య - ఢిల్లీ మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ నడపనున్నట్టు ఇదివరకే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
అయితే, మహర్షి వాల్మీకి ఎయిర్‌పోర్టు ప్రారంభం రోజైన శనివారం అయోధ్య ఢిల్లీ మధ్య ప్రారంభ సర్వీసులు నడుపుతున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక విమాన సర్వీసులు సమయం విషయానికి వస్తే డిసెంబరు 30న ప్రారంభ విమాన సర్వీసు ఐఎక్స్ 2789 ఢిల్లీ నుంచి 11 గంటలకు బయలుదేరి 12:20 గంటలకు అయోధ్యలో ల్యాండ్ అవుతుంది. అయోధ్యలో ఐఎక్స్ 1769 సర్వీస్ 12:50 గంటలకు ఢిల్లీకి బయలుదేరి 14:10 గంటలకు చేరుకుంటుంది.
 
ఇక జనవరి 17న బెంగళూరు - అయోధ్య రూట్లో షెడ్యూల్ ప్రకారం ఉదయం 08:05 గంటలకు బెంగళూరులో బయలుదేరి 10:35కి అయోధ్య చేరుకుంటుంది. అయోధ్య నుంచి 15:40కి బయలుదేరి 18:10కి బెంగళూరు చేరుకుంటుంది. అయోధ్య - కోల్‌కతా మార్గంలో అయోధ్య నుంచి 11:05కి బయలుదేరి 12:50 గంటలకు కోల్‌కతాకు చేరుతుంది. కోల్‌కతా నుంచి అయోధ్యకు తిరుగు ప్రయాణం 13:25 గంటకి మొదలై 15:10 గంటలకుకి అయోధ్యకు చేరుకుంటుందని షెడ్యూల్ తెలుపుతోంది. ఈ మేరకు మూడు వారాల నాన్ స్టాప్ విమానాల షెడ్యూల్‌ను ఎయిర్ లైన్ వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్తవారికి అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్యానికి కీలకం : ప్రధాని మోడీ