Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేద నిలయంలో 'మన్నార్గుడి మాఫియా'... అమ్మ పోగానే శశికళ ఘన స్వాగతం

పోయస్ గార్డెన్‌లోని వేద నిలయంకు ప్రత్యేకమైన పేరు ఉంది. ఎందుకంటే... ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత సొంత ఇల్లు. ఈ ఇంట్లోకి అనుమితి లేనిదే చీమ కూడా వెళ్లడానికి లేదు. అలాంటిది.. జయలలిత భూమాత ఒడిలోకి చేరుక

Advertiesment
వేద నిలయంలో 'మన్నార్గుడి మాఫియా'... అమ్మ పోగానే శశికళ ఘన స్వాగతం
, శుక్రవారం, 9 డిశెంబరు 2016 (10:02 IST)
పోయస్ గార్డెన్‌లోని వేద నిలయంకు ప్రత్యేకమైన పేరు ఉంది. ఎందుకంటే... ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత సొంత ఇల్లు. ఈ ఇంట్లోకి అనుమితి లేనిదే చీమ కూడా వెళ్లడానికి లేదు. అలాంటిది.. జయలలిత భూమాత ఒడిలోకి చేరుకోగానే మన్నార్గుడి మాఫియా తిష్టవేసింది. ఈ మాఫియాను  జయలలిత దూరం పెట్టారు. కానీ, ఆమె విశ్రమించగానే అమ్మ ప్రియనెచ్చెలి శశికళ ఈ మాఫియాకు ఘన స్వాగతం పలికింది. దీంతో ఈ మాఫియా వేద నిలయంలో తిష్టవేసింది. 
 
ఈ మన్నార్గుడి మాఫియా... శశికళతో పాటు.. పాటు.. ఆమె భర్త నటరాజన్, సోదరుడు దివాకరన్, ఇళవరసి, ఆమె కుమారుడు వివేక్, సోదరి ప్రియ, మేనల్లుళ్లు వెంకటేష్, మాధవన్, ఆమె మేనకోడలి భర్త శివకుమార్‌లు ఉన్నారు. వీరినే 'మన్నార్గుడి మాఫియా' రాష్ట్ర వాసులు పిలుస్తుంటారు. శశికళ సొంత ఊరైన తిరువూరు జిల్లా మన్నార్గుడి పేరు మీద, ఆమె బంధువర్గాన్ని ఈ పేరుతో ఉదహరిస్తారు.
 
ఈ మాఫియా ఇప్పుడు జయలలిత నివాసం వేద నిలయంలో చేరింది. జయలలిత గతంలో వీరిలో కొందరిని దగ్గర చేర్చుకున్నప్పటికీ, ఆపై జరిగిన పరిణామాలు, వీరి మనస్తత్వం తెలుసుకున్న ఆమె అందరినీ దూరం పెట్టింది. ఇప్పుడిక జయలలిత మరణానంతరం, ఆమె నెచ్చెలి శశికళ, తన భర్త సహా బంధువర్గాన్నంతటినీ పోయిస్ గార్డెన్‌లోకి స్వేచ్ఛగా అనుమతించడమే కాకుండా అక్కడే తిష్టవేసేలా అనుమతిచ్చినట్టు సమాచారం. గతంలో జయలలిత పక్కనబెట్టిన వారిని శశికళ తిరిగి దగ్గరకు చేరదీయడంపైనే సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చీకటి రాజకీయాలకు జయలలిత బలైందా? చివరి ఘడియల్లోనూ నమ్మకద్రోహం!