Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడితో కుమార్తె శృంగారంలో... కళ్లారా చూసిన తల్లి.. ఆ తరువాత?

Advertiesment
Affair
, మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (15:55 IST)
అక్రమ సంబంధాలు ప్రాణాలు తీసేలా చేస్తున్నాయి. తన బండారం ఎక్కడ బయటపడుతోందనన్న భయంతో ఏకంగా ఒక కుమార్తె తన తల్లిదండ్రులను దారుణంగా హత్య చేసింది. ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఢిల్లీలోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది.
 
ఢిల్లీలోని నోయిడా ప్రాంతంలో హైదరాబాదుకు చెందిన తెలుగు వారు జ్యోతమ్మ, రాధాక్రిష్ణలు నివాసముండేవారు. వీరికి హారిక అనే కుమార్తె ఉంది. ఈమెకు రెండేళ్ల క్రితం వివాహమైంది. భర్తతో గొడవల కారణంగా రెండు నెలల వరకు మాత్రమే కాపురం చేసి తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసంది హారిక. ఒక్కగానొక్క కుమార్తె కావడంతో తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెను ప్రేమగా చూసుకున్నారు.
 
ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టంలేక హారిక నోయిడాలోని సాఫ్ట్వేర్ కంపెనీలో చేరింది. ఆ కంపనీ ఎమ్‌డి కోటేశ్వర్‌కు పిఎగా హారిక చేరింది. కోటేశ్వర్‌కు వివాహం కాలేదు. కోటేశ్వర్‌తో చనువు పెంచుకున్న హారిక అతనికి బాగా దగ్గరైంది. హారిక తల్లిదండ్రులు హైదరాబాద్‌లో సొంత పనుల నిమిత్తం నెలరోజుల పాటు వెళ్ళారు. దీంతో హారిక తన ఇంట్లోనే ప్రేమికుడితో సరససల్లాపాల్లో మునిగితేలేది. 
 
అయితే ఒకరోజు ఉన్నట్లుండి తల్లి జ్యోతమ్మ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో తన కూతురు హారిక, కోటేష్‌లు ఇద్దరూ ఏకాంతంగా కలిసి ఉన్నారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయింది హారిక తల్లి. దీంతో తల్లీకూతుళ్ళ మధ్య పెద్ద గొడవే జరిగింది. అయితే తన బండారం ఎక్కడ బయటపడిపోతుందేమోనని భయపడింది హారిక. ప్రియుడి సహాయంతో రాత్రివేళ ఇంటిలో నిద్రిస్తున్న తల్లిని గొంతు నులిమి చంపేసింది. శవాన్ని నోయిడా ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో పడేసింది. 
 
మరుసటి రోజు తండ్రి ఇంటికి వచ్చాడు. జ్యోతమ్మ ఎక్కడని కుమార్తెని ప్రశ్నించాడు. బంధువుల ఇంటికి వెళ్ళిందని రేపు ఉదయం వస్తుందని చెప్పింది హారిక. సరేనని రాధాక్రిష్ణ ఇంటిలో పడుకున్నాడు. సేమ్ అదే రిపీట్ అయ్యింది. తండ్రి కూడా తనకు అడ్డుగా ఉన్నాడని చంపేయాలనుకుంది. ప్రియుడిని పిలిచి గొంతు నులిమి చంపేసింది. తల్లి శవాన్ని ఎక్కడైతే పడేశారో అదే ప్రాంతంలో ఈ శవాన్ని పడేశారు. సి.సి. ఫుటేజ్ ద్వారా కారు నెంబర్‌ను గుర్తించిన పోలీసులు ప్రియుడు కోటేష్, హారికను అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్‌పై పేలుడు పదార్థాలు ప్రయోగిస్తే సర్జికల్ స్ట్రైక్స్‌పై సందేహాలురావు...