చెన్నైలో మళ్లీ మూగజీవిపై దారుణం: కుక్క మెడకు తాడు కట్టి ఇద్దరూ చెరో వైపు లాక్కెళ్లారు
						
		
						
				
గత ఏడాది ఓ భవనం నుంచి కుక్కను కిందికి తోసేసిన మెడికల్ స్టూడెంట్ ఘటన మరవకు ముందే.. అదే చెన్నైలో మరో ఘటన చోటుచేసుకుంది. ఏడాది క్రితం అపార్ట్మెంట్ భవనం నుంచి ఓ కుక్కను కిందికి తోసేస్తూ సోషల్ మీడియాలో పో
			
		          
	  
	
		
										
								
																	గత ఏడాది ఓ భవనం నుంచి కుక్కను కిందికి తోసేసిన మెడికల్ స్టూడెంట్ ఘటన మరవకు ముందే.. అదే చెన్నైలో మరో ఘటన చోటుచేసుకుంది. ఏడాది క్రితం అపార్ట్మెంట్ భవనం నుంచి ఓ కుక్కను కిందికి తోసేస్తూ సోషల్ మీడియాలో పోస్టు అయిన వీడియో వైరల్ అయ్యింది. 
 
 			
 
 			
					
			        							
								
																	
	 
	ఇందులో భవనం నుంచి శునకాన్ని కిందికి తోసేసిన మెడికల్ స్టూడెంట్ను అతడు చదివే మెడికల్ కళాశాల సస్పెండ్ చేసింది. ఇలా మూగ జీవాలను హింసించడమే కాకుండా ఆ సందర్భంగా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటనలు పలుసార్లు చెన్నైలో వెలుగు చూశాయి. 
	 
	తాజాగా ఓ శునకం మెడకు తాళ్లు కట్టి ఇద్దరు దాన్ని లాక్కెళ్లారు. ఆ మూగ జీవి మెడలో కట్టిన తాడుతో శ్వాస తీసుకోలేక బాధతో అరుపులు పెట్టినా వారు పట్టించుకోలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేంద్ర మంత్రి, జంతు ప్రేమికురాలు మేనకా గాంధీ స్పందించి, విచారణకు ఆదేశించారు. 
	
	ఆ మూగజీవిని హింసించిన వారిపై బ్లూ క్రాస్ సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటన చెన్నై తాంబరంలోని ఓ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో జరిగినట్లు సమాచారం.