Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అప్పుతీర్చలేక కట్టుకున్న భార్యను స్నేహితులకు అప్పజెప్పిన భర్త..

తీసుకున్న అప్పు తీర్చలేక ఓ దుర్మార్గుడు కట్టుకున్న భార్యనే స్నేహితులకు అప్పజెప్పాడు. అంతేగాక, ఆమెపై అత్యాచారం చేయించాడు ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బులందర్ షార్‌కు చెందిన నర

Advertiesment
A husband puts his wife for hostage for not clearing loan
, శుక్రవారం, 14 అక్టోబరు 2016 (13:56 IST)
తీసుకున్న అప్పు తీర్చలేక ఓ దుర్మార్గుడు కట్టుకున్న భార్యనే స్నేహితులకు అప్పజెప్పాడు. అంతేగాక, ఆమెపై అత్యాచారం చేయించాడు ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బులందర్ షార్‌కు చెందిన నరేష్ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి జీవనోపాధికి ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌లోని అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. 
 
ఢిల్లీలోని ఓ బట్టలదుకాణంలో పనిచేసే టింకూ వర్మ అనే వ్యక్తితో నరేష్‌కు స్నేహం మొదలైంది. నరేష్ టింకూ వర్మ దగ్గర కొన్నిరోజుల క్రితం రూ.5 వేలు అప్పుగా తీసుకున్నాడు. తన డబ్బులు తనకు ఇవ్వాలని టింకూ నరేష్‌పై ఒత్తిడి తెచ్చాడు. దీంతో తీసుకున్న అప్పు తీర్చలేక తన భార్యని స్నేహితుడితో పంపించేశాడు. విషయం ఎవరికైనా చెబితే మా తమ్ముళ్లను చంపేస్తామని బెదిరించారు అని 26 యేళ్ల నరేష్ భార్య అక్టోబర్ 1న లోని ప్రాంత పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 
 
అయితే ఆమె భర్త నరేష్ ఈ సంఘటనను ఖండిస్తుండగా, స్నేహితుడి భార్యను లైంగికంగా వేధించినట్లు టింకూ ఒప్పుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. టింకూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ సమయంలో నరేష్ ఇంటి బయట కాపాల కాచినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Jioకు పోటీ.. బీఎస్ఎన్ఎల్ పక్కా ప్లాన్.. స్పెక్ట్రమ్ ఆక్షన్‌లో కామ్‌గా ఎందుకుందంటే?