వేసవి కాలం కారణంగా పలు ప్రాంతాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జార్ఖండ్‌లోని జెంషెడ్‌పూర్ టాటా స్టీల్ ప్లాంట్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
ఈ పేలుడులో ఇద్దరు వర్కర్లు గాయాలకు గురైనారు. కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మంటలు చెలరేగిన ప్రాంతంలో ఎలాంటి పనులు జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ విషయం తెలియగానే ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. బ్యాటరీ పేలడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని టాటా స్టీల్ అధికారులు తెలిపారు.