Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ యువకుడు నమ్మించి మోసం చేశాడు... నాకు న్యాయం చేయండి : హిజ్రా ఫిర్యాదు

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు తనని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడాని ఓ ట్రాన్స్‌జెండర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాదాపు ఐదేళ్లు తనతో ప్రేమాయణం సాగించి, తనకు తెలియకుండా మరో యువతిని

Advertiesment
boy
, బుధవారం, 2 నవంబరు 2016 (13:06 IST)
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు తనని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడాని ఓ ట్రాన్స్‌జెండర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాదాపు ఐదేళ్లు తనతో ప్రేమాయణం సాగించి, తనకు తెలియకుండా మరో యువతిని పెళ్ళి చేసుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తనకు న్యాయం జరగాలని ప్రియుడితో పెళ్లి జరగాలని ఆవేదన వ్యక్తంచేస్తోంది. ఈ వింత ఘటన కృష్ణా జిల్లాలోని పెనుమలూరులో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... ఒంగోలుకి చెందిన దుర్గారావ్‌కి ఇంటర్ చదివే సమయంలో విజయవాడలోని కానూర్‌కి చెందిన రాకేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఇద్దరు అబ్బాయిల స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి అబ్బాయిల మధ్య ప్రేమ, పెళ్ళి అంటే పెద్దలు ఖచ్చితంగా ఒప్పుకోరని దీనికోసం వీరిద్దరు ఒక ఉపాయం ఆలోచించారు. 
 
అదేంటంటే... అమ్మాయిగా మారితే పెళ్ళి చేసుకుంటానని రాకేష్ చెప్పాడు. దీంతో అతని మాటలు నమ్మి దుర్గా వెంటనే ముంబైకి వెళ్ళి లింగమార్పిడి చేయించుకుంది. తన పేరుని దుర్గాగా మార్చుకుంది. అనంతరం కొన్నాళ్ళపాటు ఇద్దరి మధ్య ప్రేమబంధం కొనసాగింది. అయితే.. ఇంతలోనే దుర్గా అనారోగ్యానికి గురికావడంతో ముంబై వెళ్ళింది. అటునుంచి తిరిగొచ్చేసరికి, రాకేష్‌కి మరో యువతితో వివాహం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న దుర్గా న్యాయం కోసం రాకేష్‌ని నిలదీసింది. 
 
రాకేష్‌తో తన పెళ్ళికి అతని తల్లిదండ్రులు ఎలాగు అంగీకరించరని... అయితే తనవద్ద నుంచి అతను తీసుకున్న పది లక్షలు వెనక్కు ఇచ్చేస్తే.. నా దారి నేను చూసుకుంటానని దుర్గా అంటోంది. కాగా సిండికేట్ బ్యాంక్‌లో పనిచేస్తున్న రాకేష్ తండ్రి దుర్గా డబ్బుల కోసం తమని బ్లాక్ మెయిల్ చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇరువురి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమికులకు ఉంగరాలు మార్చి పెళ్లి జరిపించిన ఎలుగుబంటి... ఎక్కడ?