వాడెక్కడ రేప్ చేశాడో తెలుసా? పార్లమెంటు బిల్డింగులో...
కామాంధులకు కన్నుమిన్నూ కానరాదంటారు. అలాంటి సంఘటనే జరిగింది. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా చెప్పుకునే పార్లమెంటు భవనంలోనే అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు. ఈ ఘటన జరిగింది బ్రిటన్ పార్లమెంటులో. మహిళపై అత్యాచారం చేసినట్లు ఆలస్యంగా కనుగొన్నారు. వివరాల్ల
కామాంధులకు కన్నుమిన్నూ కానరాదంటారు. అలాంటి సంఘటనే జరిగింది. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా చెప్పుకునే పార్లమెంటు భవనంలోనే అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు. ఈ ఘటన జరిగింది బ్రిటన్ పార్లమెంటులో. మహిళపై అత్యాచారం చేసినట్లు ఆలస్యంగా కనుగొన్నారు. వివరాల్లోకి వెళితే... ఎంపీ వద్ద పని చేసే 23 ఏళ్ల వ్యక్తి ఓ మహిళను పార్లమెంటు భవనంలో నిర్బంధించి ఘాతుకానికి పాల్పడ్డట్లు తేలింది.
అక్టోబరు 14న జరిగిన ఈ ఘటనపై సెక్సువల్ అఫెన్సెస్ డిటెక్టివ్‌లు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, అతడు బెయిల్ కూడా తీసుకుని బయటకు వచ్చేశాడు. ఐతే అత్యాచారానికి పాల్పడింది ఓ ఎంపీ అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తన యజమాని కోసం అతడి సహాయకుడు తప్పును నెత్తినవేసుకున్నాడని అంటున్నారు. మరి నిజమేమిటో తేలాల్సి ఉంది.