Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డబ్బు కోసం యువతి బ్లాక్ మెయిల్ : వృద్ధుడిని నగ్నంగా వీడియో తీసి...

Advertiesment
Meerut man blackmailed
, శనివారం, 20 డిశెంబరు 2014 (17:19 IST)
సాధారణంగా యువతులను యువకులు మోసం చేయడం, బ్లాక్ మెయిల్ చేయడం చూస్తుంటాం. కానీ, ఈ కేసులో అంతా రివర్స్. డబ్బు కోసం 70 రిటైర్డ్ వృద్ధుడిని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటన ఒకటి మీరట్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. 
 
మీరట్‌లో 20 సంవత్సరాల యువతి ఒకరు బ్యాంకు ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన 70 ఏళ్ల వృద్దుడితో పరిచయం పెంచుకుంది. ఆయనకున్న ఆరోగ్య అవసరాలు తీరుస్తామని నమ్మబలికి ఓ ఔషద కేంద్రంలో సభ్యుడిగా చేర్పించి, వైద్య సేవలు చేస్తూ వచ్చింది. స్పెషల్ మెడిసిన్ అంటూ ఇచ్చిన మూలికలు ఇచ్చింది. వాటిని స్వీకరించిన వృద్ధుడు తర్వాత అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. ఆ సమయంలో అతని దుస్తులు విప్పేసి సన్నిహితంగా ఉన్నట్టుగా ఫోజులిచ్చి.. తన స్నేహితులతో వీడియో తీయించింది. 
 
ఆ తర్వాత ఆ వీడియోను ఆ వృద్ధుడికి చూపించి బ్లాక్ మెయిల్ చేయసాగింది. డబ్బు ఇవ్వకుంటే వీడియో బయటపెడతామంటూ బెదిరించింది. దీంతో పరువు పోతుందని భావించిన ఆయన రూ.5 లక్షలు చెల్లించాడు. వాళ్ళు మళ్ళీ డబ్బులు డిమాండ్ చేయగా, తన వద్ద లేవని బదులివ్వడంతో కిడ్నీ ఇవ్వాలని బెదిరించారు. ఇక లాభంలేదని ఆయన పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బ్లాక్ మెయిల్ యువతితో పాటు.. మరో ఇద్దరు సభ్యుల కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu