లాక్డౌన్ కారణంగా ఇండోనేషియాలోని బాలిలో 70 మంది భారతీయులు చిక్కుకుపోయారు. వీరిలో 12 మంది తెలుగు వారే ఉన్నారు.
ఇండియాకు రావాల్సిన విమానాలు రద్దై టికెట్లు క్యాన్సిల్ అయ్యాయని వాపోయారు. దీంతో ఇండియన్ అంబాసిని కలవగా వారు ఉండేందుకు బ్రహ్మపుత్రి అనే ఆశ్రమం ఇచ్చారని, అందరూ ఒకే చోట ఉంటే కరోనా వస్తుందేమోననే భయంతో హొటల్స్లో రూమ్ తీసుకున్నామని తెలిపారు.
తెచ్చుకున్న డబ్బులు సైతం అయిపోయాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తమను ఆదుకుని, స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
వీరిలో హైదరాబాద్ నుంచి ఐదుగురు, విజయవాడ నుంచి 5 గురు, తిరుపతి నుంచి ఇద్దరు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.