దేశ వ్యాప్తంగా గత యేడాది వివిధ రాష్ట్రాల్లో 144 మందికి ముద్దాయిలకు కోర్టులు మరణశిక్షలను విధించాయి. అయితే, అప్పటికే ఈ శిక్షలు పడి, అమలు పెండింగ్‌లో ఉన్న వాటిని కలిపి చూస్తే 2021లో మొత్తం 488 మంది ప్రస్తుతం మరణశిక్షలను ఎదుర్కొంటున్నారు. ఈ వివరాలను ఢిల్లీ న్యాయ విశ్వవిద్యాలయం చేసింది.
ఈ వర్శిటీ నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని సెషన్స్ కోర్టులు గత యేడాది 34 మంది మరణశిక్షలను ఖరారు చేశాయి. ఇదే ఇతర రాష్ట్రాల కోర్టులు విధించిన కోర్టులతో పోల్చితే అధికం. దీంతో ఈ రాష్ట్రంలో మరణశిక్షలను అమలు చేయాల్సిన వారి సంఖ్య 86కు చేరింది. ఆ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 మందికి, తెలంగాణాలో ఒక ముద్దాయికి శిక్ష విధించాయి. సుప్రీంకోర్టు మాత్రం గతయేడాది ఒక్క కేసులోనూ ఈ శిక్షను ఖరారు చేయలేదు.
ప్రస్తుతం దేశంలో మరణశిక్షలను ఎదుర్కొంటున్న వారిలో 2016లో 400గా వుంటే, 2017లో 366, 2018లో 426, 2019లో 378, 2020లో 404, 2021లో 488 మందికి పెరిగింది.