ప్రియుడి కోసం ఒంటరిగా వచ్చిన యువతి.. డ్రైవర్ - కండక్టర్ లైంగికదాడి
కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. తన ప్రియుడిని వెతుక్కుంటూ ఒంటరిగా వచ్చిన ఓ మైనర్ బాలికపై కొందరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి పాల్పడింది కూడా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఆర్టీసీ బ
కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. తన ప్రియుడిని వెతుక్కుంటూ ఒంటరిగా వచ్చిన ఓ మైనర్ బాలికపై కొందరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి పాల్పడింది కూడా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్ కావడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
ఈ వివరాల్లోకి వెళ్తే ఉడుపి జిల్లా మణిపాల్‌కు చెందిన బాలిక - ఉడుపిలో ఓ కాలేజీ కుర్రాడు ప్రేమించుకున్నారు. ఇద్దరికి విభేదాలు రావడంతో ఆ యువకుడు హావేరి జిల్లా రాణిబెన్నూరుకు వచ్చేశాడు. బాలిక కూడా ఈ నెల 5వ తేదీన మణిపాల్ నుంచి కేఎస్‌ఆర్టీసి బస్సులో ఒంటరిగా రాణిబెన్నూరుకు వచ్చి ప్రియుడి కోసం గాలించింది. ఎంత ప్రయత్నించినా ప్రియుడి ఆచూకీ లభించకపోవడంతో ఈనెల 6వ తేదీ రాత్రి రాణిబెన్నూరు బస్టాండ్‌కు చేరుకుంది.
ఒంటరిగా ఉన్న బాలికను గమనించిన కేఎస్‌ఆర్టీసీ బస్సు డ్రైవర్ వీరయ్య హీరేమఠ, కండక్టర్ యువరాజ్ కట్టెకార్‌తో పాటు మరో డ్రైవర్ రాఘవేంద్ర బడిగేరెలు తాము సహాయం చేస్తామంటూ నమ్మబలికి, బస్సులోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఆ తర్వాత మరుసటి రోజు ఆ బాలికను అదే బస్సులో తీసుకెళ్లి మణిపాల్‌లో దించేసారు.
ఇంటికి చేరుకున్న తర్వాత ఈ ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఉడుపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గురి కామాంధులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అలాగే, బసు డ్రైవర్లు, కండక్టర్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.