Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీలో దారుణం : 10 నెలల పసికందుపై 38 యేళ్ల మృగాడు అత్యాచారం

ఢిల్లీలో దారుణం జరిగింది. 10 నెలల పసికందుపై 38 యేళ్ల మృగాడు ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునే పైశాచిక చర్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Advertiesment
ఢిల్లీలో దారుణం : 10 నెలల పసికందుపై 38 యేళ్ల మృగాడు అత్యాచారం
, ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (12:52 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. 10 నెలల పసికందుపై 38 యేళ్ల మృగాడు ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునే పైశాచిక చర్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
శుక్రవారం రాత్రి పాపతో సహా తల్లిదండ్రులు ఇంటి బయట నిద్రిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో నిద్రలేచిన తల్లికి పాప కనిపించలేదు. పాప ఏమైపోయిందోనన్న ఆందోళనలో తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారు చుట్టుపక్కల వెతికారు. ఓ నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ దగ్గర్లో పాప ఏడుపు వినిపించింది. 
 
అక్కడకు వెళ్లిన తల్లిదండ్రులకు దారుణమైన దృశ్యం కనిపించింది. పాపతో లైంగిక వాంఛ తీర్చుకుంటున్న ఆ దుర్మార్గుడిని చితక్కొట్టారు. పాపను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీలోని వికాస్‌పురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఢిల్లీ వెస్ట్ విశాఖపురి ఏరియాలో జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుమార్తెపై అత్యాచారం.. ఆపై గొంతునులిమి చంపేసిన కసాయి తండ్రి