సినీ నటి రంజితతో రాసలీలలు సాగిస్తున్నట్టు మీడియాకు అడ్డంగా దొరికిన సీడీ నిజమని అంగీకరిస్తూ వాంగ్మూలమిస్తే ఎమ్మెల్యే పదవితో పాటు 20 కోట్ల రూపాయల నగదు ఇస్తారని సినీ నటి రంజితకు ఆశ చూపారని ఆధ్యాత్మిక గురువు నిత్యానంద తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆమె అంగీకరించలేదన్నారు. దీనికి కారణం ఆమె తన ప్రియశిష్యురాలు కావడమేనన్నారు.
అదేసమయంలో మీడియాకు చిక్కిన నకిలీదని నిరూపించే బలమైన సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు. వాటిని కోర్టుకు సమర్పించి తన నిజాయితీని నిరూపించుకుంటానని నిత్యానంద చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా, తనపై జరిగింది కుట్ర అని ప్రజలతో పాటు తన భక్తులకు తెలియజేసేందుకు వారిలో అవగాహన కల్పించేందుకు వచ్చే నెల 18వ తేదీన బెంగుళూరులో కుండలీకరణ శక్తిని ప్రదర్శించనున్నట్టు చెప్పారు. ఈ శక్తి ప్రదర్శనలో భాగంగా ఒక గ్రాము పౌడర్‌ను కొన్ని వేల కిలోమీటర్లు పంపించి తన శక్తిని నిరూపించుకుంటానని చెప్పారు.