Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాఠశాల స్థాయిలో లైంగిక విద్య వద్దు: కమిటీ

Advertiesment
వార్తలు జాతీయం పాఠశాల విద్యార్థులు లైంగిక విద్య కళాశాల స్థాయి జీవశాస్త్రం పార్లమెంటరీ కమిటీ విముఖత అంతర్జాతీయ స్థాయి అనారోగ్యకరమైన వాతావరణం
పాఠశాల స్థాయి విద్యార్థినీ-విద్యార్థులకు లైంగిక విద్య (సెక్స్ ఎడ్యుకేషన్)ను ప్రవేశ పెట్టడంపై పార్లమెంటరీ కమిటీ విముఖత వ్యక్తం చేసింది. లైంగిక విద్యపై విద్యార్థులలో అవగాహన కల్పించేందుకు అవసరమైన పాఠ్యాంశాలను కళాశాల స్థాయినుంచి జీవశాస్త్రంలో ప్రవేశ పెడితే చాలని ఆ కమిటీ సూచించింది.

ఇదిలావుండగా అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులకు లైంగిక పరిజ్ఞానం కల్పించాలని వస్తున్న ఆందోళనలల్లో భాగంగా మన దేశంలోకూడా విద్యార్థులకు లైంగిక విద్య అవసరమా లేదా అనే దానిపై చర్చంచి పరిశోధించిన కమిటీ పెళ్ళికి ముందు లైంగిక పరిజ్ఞానం(సెక్స్)వద్దని పాఠశాల స్థాయి విద్యార్థులకు బోధించడం అనైతికమని, ఇది అనారోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొదిస్తుందని రాజ్యసభ ఫిర్యాదులపై ఏర్పాటైన ఈ కమిటీ తన నివేదికలో పేర్కొంది. కాగా పాఠశాలలోని విద్యార్థులకు సెక్స్ గురించి బోధించాల్సిన అవసరంలేదని కమిటీ స్పష్టం చేసింది.

ముఖ్యంగా ధర్మాన్ననుసరించి మెలిగే ఈ భారతావనిలో పాఠశాల స్థాయి విద్యార్థులకు లైంగిక విద్య అవసరంలేదని, వివాహేతర సెక్స్ సమాజ శ్రేయస్సుకు మంచిది కాదని విద్యార్థులలో చైతన్యం తీసుకురావాలని కమిటీకి నేతృత్వం వహించిన బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

మనదేశంలో జరుగుతున్న బాల్యవివాహాలు చట్టవిరుద్ధమని, ఇది బాలిక ఆరోగ్యానికి హానికరమని విద్యార్థులకు అవగాహన కల్పించాలే తప్ప, వారికి లైంగిక విద్య అవసరం లేదని కమిటీ అభిప్రాయపడింది.

Share this Story:

Follow Webdunia telugu