Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మానసిక ఆరోగ్యానికి మేలైన చిట్కాలు

మానసిక ఆరోగ్యానికి మేలైన చిట్కాలు
, గురువారం, 4 అక్టోబరు 2007 (12:42 IST)
పోటీప్రపంచంలో మెరుగైన జీవన ప్రమాణాన్ని అందుకోవడం కోసం సాగించే జీవనపోరాటంలో నలుగురు మాత్రమే సభ్యులుగా గల కుటుంబాలు సైతం ఒకరితో ఒకరి కలిసిమెలిసి మాట్లాడుకునేందుకు వీలు కల్పించని విధంగా ప్రతిఒక్కరు తమ వృత్తి వ్యాపకాలలో నిమగ్నమైపోతున్న వైనం చర్వితచరణమే. ఈ నేపథ్యంలో మనిషి ముందుకు సాగడానికి ఎంతగానో ఉపకరించే మానసిక ఆరోగ్యాన్ని సంతరించుకోవడానికి కొన్ని చిట్కాలను మీ ముందు ఉంచుతున్నాము.

1 ఆత్మవిశ్వాసాన్నిపెంచుకోండి
మీలోని బలాన్ని, బలహీనతలను గుర్తించండి. గుర్తించిన వాటిని రాగద్వేషాలకు పోకుండా బేరీజు వేసి లోపాలను సరిచేసుకుంటూనే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి.
2. సరైన ఆహారం, అదుపులో శరీరం.. సమతుల ఆహారం, వ్యాయామం మరియు విశ్రాంతి మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయకుండా ఆనందకర జీవితాన్ని అందిస్తాయి.
3. మిత్రులతో, కుటుంబంతో గడపండి... ఈ బంధాలను,అనుబంధాలను కాపాడుకోవడం మీ కర్తవ్యం. మీ దినసరి ప్రణాళికలో వారికి కొంత సమయాన్ని కేటాయించడం ద్వారా మీ కష్టసుఖాలను వారితో పంచుకోండి.
4. ఇచ్చి పుచ్చుకునే మద్దతు.. ఇలాంటి అంశాలలోనే స్నేహం మరియు కుటుంబ బాంధవ్యాల అసలు రూపం బయటపడేది
5. ఆర్ధిక సమస్యల మానసిక ఒత్తిడికి దారితీస్తాయి. అవసరమైన వాటికన్నా కోరుకునే వాటిపై అధికంగా ఖర్చు పెట్టడం మంచిది కాదు.
6. సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొని అమూల్యమైన మానసిక ఆనందాన్ని సొంతం చేసుకోండి.
7. ఒత్తిడికి గుడ్‌బై.. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా ఒత్తిళ్ళకు గుడ్‌బై చెప్పండి.
8. సమస్యలను పంచుకోండి.. సమస్యలను ఇతరుల ముందు ఉంచి, వారు అందించే పరిష్కారానికి మీదైన కార్యశీలతను జోడించి ముందుకు సాగండి
9. భావోద్యేగాల ప్రదర్శన... మనలోని కోపం, విషాదం, ఆనందం, భయం తదితర భావాలను ప్రదర్శించేందుకు నిర్మాణాత్మకమైన, సురక్షితమైన మార్గాలను ఎంచుకోండి.
10. మీలోనే శాంతి ఉన్నది.. మీ గురించి మీరు తెలుసుకోండి, మిమ్మల్ని ఆనందపరిచేవి మరియు మీరు మార్చుకోలేని మరియు మార్చగల వాటి మధ్య సమతూకం పాటించండి.

Share this Story:

Follow Webdunia telugu