జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి!?
, మంగళవారం, 26 జూన్ 2012 (15:05 IST)
జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే.. వారానికి రెండుసార్లు తలంటుపోసుకోవాలి. తలంటు పోసుకునే రోజుకు ముందు రోజు రాత్రి నీళ్ళలో ఓ రెండు స్పూన్ల మెంతులు నానబెట్టి వుంచాలి. మరునాడు నానిన మెంతులకు, ఓ గుప్పెడు మందార ఆకులను చేర్చి మెత్తగా పేస్ట్‌లాగా రుబ్బుకోవాలి. ఈ రుబ్బిన పేస్ట్‌ను జుట్టును పాయలు పాయలుగా విడదీస్తూ, తలకి బాగా అంటేలాగా రాయాలి. ఆ తర్వాత జుట్టును ముడివేసి ఒక గంట తర్వాత కుంకుడురసం లేదా శీకాయతో తలంటుకోవాలి. జుట్టును టవల్‌తో గట్టిగా బిగించి ముడివేయకూడదు. జుట్టుకు మృదువుగా టవల్‌ని చుట్టి నడినెత్తిన చుట్టి పెట్టుకోవాలి. జుట్టును చిక్కు తీసేటప్పుడు వెడల్పు పళ్ళున్న దువ్వెనను ఉపయోగించాలి. ఆ తర్వాత సన్నని పళ్ళుగల దువ్వెనతో దువ్వుతూ జుట్టు బాగా ఆరాక శిరోజాలంకరణ చేసుకోవాలి. మంచి వాసనగల పూలు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. మందార పువ్వులను మాడుకు బాగా రుద్దుకోవాలి. ఏదైనా పార్టీల్లాంటి వాటి కోసం రకరకాల పిన్నుల్తో స్టైల్ వేసుకుంటే రాగానే పిన్నులన్నీ తీసేసి జట్టు చక్కగా చిక్కుతీసి జడ అల్లకుండా కనీసం అరగంటైనా ఆరనివ్వాలి.