Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శృంగార పురుషులేనా..? హాస్య పురుషులు కాదా..?!!

Advertiesment
పురుషులు
, గురువారం, 2 ఫిబ్రవరి 2012 (18:00 IST)
File
FILE
నాటి నుంచి నేటి వరకు స్త్రీలను అర్థం చేసుకోవడం పురుషులకు అంత సులభమైన విషయం కాదు. ఏ సమయంలో ఏ విధంగా కోరుకుంటారో... అనుకుంటుంటారో పురుషులకు అర్థం కాదు. ఒక విధంగా చెప్పాలంటే స్త్రీలను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే పురుషుడు పిచ్చి ప్రేమికుడి అవతారం ఎత్తాల్సిందే.

* పురుషులలో ఏలాంటి వారిని స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారు అనే అంశంపై ఒక చిన్నపాటి సర్వే నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం మహిళకు ఎలాంటి పురుషులంటే ఇష్టమో తెలుసుకుందాం! హాస్యభావం కలిగివుండే పురుషులను ఎక్కువగా స్త్రీలు ఇష్టపడతారట. స్త్రీలకు ఎప్పుడూ "చిటపట"మంటూ ఉండే పురుషులంటే అస్సలు ఇష్టముండదట.

* సంతోషాల సంద్రంలో మునిగి తేల్చే హాస్యాన్ని రంగరించే పురుషులను స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారు. ఆ హాస్య భావంతో ఉన్న పురుషులు ప్రేమికులుగానో, భర్తగానో వస్తే స్త్రీల సంతోషానికి హద్దులు ఉండవు.

* అలాంటి హాస్య పురుషుల పట్ల స్త్రీలకు కలిగే ప్రేమకు హద్దే ఉండదట. అలా అని 24 గంటలసేపు కామెడీ చేస్తే కూడా నచ్చదట. ఎందుకంటే ముఖ్యమైన విషయం ఏదైనా మాట్లాడేటప్పుడు ఇలా ఉంటే నచ్చదు. జీవితంలో చిన్న చిన్న గొడవలతో పాటు ఓదార్పులు, పరామర్శలు కూడా ఉండాలని కోరుకుంటారట.

* ఈ విధమైన హాస్య భావం కలిగిన పురుషులను పొందిన పలువురు మహిళలను సంప్రదిస్తే... మేము చాలా అదృష్టవంతురాళ్లం. మా భర్తలను మేము ఎక్కువగా ప్రేమిస్తున్నాం. మేము ఆఫీసు నుంచి కోపంగా వచ్చినా లేదా అలసిపోయి వచ్చినా మా పతులు హాస్యంతో నవ్వించేందుకు ప్రయత్నిస్తారు అని చెప్పుకొచ్చారు.

* ఆ సమయంలో మేము మా బాధలను, అలసటని మర్చిపోతాం. మాకు ప్రతి రోజు చాలా సంతోషంగా గడిచిపోతుందని వారు అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu