Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రహ్మోత్సవాల సృష్టికర్త బ్రహ్మదేవుడు

Advertiesment
బ్రహ్మోత్సవాల సృష్టికర్త బ్రహ్మదేవుడు
, మంగళవారం, 11 సెప్టెంబరు 2007 (18:51 IST)
WD PhotoWD
నిత్యకళ్యాణం పచ్చతోరణం అన్న చందంగా ఏడాది పొడవునా తిరుమల వేంకటేశ్వరునికి ఎన్ని ఉత్సవాలు జరుగుతున్నప్పటికీ.. ఏడాదికోసారి నిర్వహించే బ్రహ్మోత్సవాలకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. శ్రీ వేంకటేశ్వరునికి జరిపించే ఉత్సవాలను మూడు రకాలుగా ఏర్పాటు చేశారు.

మూడు రకాల ఉత్సవాలు:
మొదటిదైన శ్రద్ధోత్సవాలలో ప్రతిరోజూ భక్తులు శ్రద్ధాశక్తులతో పాల్గొనే కల్యాణోత్సవాలు, ఆర్జిత సేవలు, ఇతర పూజలకు చెందినవి. కాగా రెండోదైన కాలోత్సవాలలో లోక కల్యాణం కోసం నిర్వహించే యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించబడతాయి.

ఇక మూడోదైన కాలోత్సవాలలో ఒక నియమిత కాలంలో వేడుకలను తలపెడతారు. ఇందులో భాగంగానే బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలే కాక పూర్వం శ్రీవారికి పవిత్రోత్సవాలు, మాసోత్సవాలు, దినోత్సవాలు, సహస్ర కలశాభిషేకాలని అనేకమైన పూజలు నిర్వహించినట్లు తెలుస్తుంది.

జ్యోతులను వెలిగించిన బ్రహ్మ:
బ్రహ్మోత్సవాల విషయానికి వస్తే.... బ్రహ్మాది దేవతలు కోరికననుసరించి కలియుగంలో భక్తజన సంరక్షణకోసం శ్రీవేంకటేశ్వరుడు వేంకటాచల క్షేత్రంలో కన్యామాసంలోని శ్రవణా నక్షత్రంలో వెలిశాడు. పురాణ వివరాల ప్రకారం... తొండమాను చక్రవర్తి నిర్మించిన ఆలయంలో వేంకటేశుడు ప్రవేశించిన అనంతరం, బ్రహ్మదేవుడు స్వయంగా అక్కడ రెండు జ్యోతులను వెలిగించి, ఆ అఖండ జ్యోతులు కలియుగాంతం వరకూ వెలుగుచుండుగాక అని పలికాడు.
webdunia
WD PhotoWD


అనంతరం బ్రహ్మదేవుడు, లోకహితం కోసం స్వామివారికి ఉత్సవాలు జరిపించాలని ఉన్నట్లు శ్రీనివాసునితో అని ప్రార్థించాడు. అందుకు వేంకటేశుడు సమ్మతించాడు. ఆ వెంటనే సృష్టికర్త విశ్వకర్మను పిలిపించి ఉత్సవానికి అవసరమైన వాహనాలను సిద్ధం చేయాల్సిందిగా పురమాయించాడు. వాహనాలు సిద్ధం అయిన తర్వాత కన్యామాసంలో శ్రవణా నక్షత్రం రోజున ఈ ఉత్సవాలు పూర్తయ్యేటట్లు 9 రోజులపాటు బ్రహ్మదేవుడు ఉత్సవాలు జరిపించాడు.

అందుకు ఎంతో సంతోషించిన వేంకటేశుడు, బ్రహ్మదేవుడు తనకు జరిపించిన ఉత్సవాలు "బ్రహ్మోత్సవాలు" గా జగత్ప్రసిద్ధి పొందుతాయని, ఈ ఉత్సవాలలో తనను దర్శించిన వారి కోరికలు నెరవేరుతాయని అనుగ్రహించాడు. అంతేకాదు శ్రవణా నక్షత్రం రోజున స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి, తనను దర్శించుకుంటే సకలపాపాలు పోయి, సర్వశుభాలు కలుగుతాయని అనుగ్రహించాడు. ఇలా బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఆ ఉత్సవాలు నేటికి బ్రహ్మోత్సవాల పేరిట బ్రహ్మాండంగా నిర్వహించబడుతున్నాయి.
-యిమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు

Share this Story:

Follow Webdunia telugu