ఛ.. అతడో అనాకారి.. అతడితో ఆ అమ్మాయా..? మరి నాకు దొరకదే ఓ గాళ్ ఫ్రెండ్...
, శుక్రవారం, 31 ఆగస్టు 2012 (14:03 IST)
ఛ... వాళ్లకన్నా నాకేం తక్కువ !!!!! నాకెందుకు ఏ అమ్మాయి/ అబ్బాయి పడటంలేదు? ఇక ఇలాంటి నిరాశలకు ఫుల్‌స్టాప్ పెట్టండి. మీకిక మీ పార్టనర్ దొరికినట్లే. అమ్మాయిలను ఇలా ఇంప్రెస్ చేయండి అంటున్నారు లవ్‌పై డీప్‌గా రీసెర్చ్ చేసిన నిపుణులు. ఎలాగో చూద్దాం...ముందు మీరు మిమ్మల్ని నమ్మండి .. నేను అందంగా లేనేమో, నచ్చనేమో ఇలాంటివి పక్కన పెట్టండి. మీకన్నా ఎందులోనూ సరితూగనివాడు కూడా అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుండటం చూసేవుంటారుగా. సో... మీపై మీరు నమ్మకంగా ఉండండి. చెప్పబోయే టిప్స్‌తో ఖచ్చితంగా అమ్మాయిలు పడి తీరుతారు కాని అది మీపై మీకున్న నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. 1.
అబ్బాయిల పర్సనాలిటీ ఆకర్షణ అబ్బాయిల పర్సనాలిటీపై ఒక్కో అమ్మాయికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. మీరు సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా అన్నది కాదు. మీరెలా ఉన్నా మీరు ధరించే బట్టల్లో మీరు ఆకర్షణీయంగా కనిపించేలా జాగ్రత్త వహించండి.. మీలో మీకు ఓ కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది.2.
ఆ అమ్మాయిని మొట్టమొదటిసారి చూసారా ? తనని మీ చూపులతో కట్టి పారేయండి.. మీరు కోరుకుంటున్న అమ్మాయి కళ్ళను సూటిగా చూడండి.. ఇలా ఓ చిరు నవ్వుతో చోస్తూ అమ్మాయికి చేరువవ్వండి..3.
మొదటిసారిగా మాట్లాడాలనుకున్నారా ? మీ మాటలు కరుగ్గా లేకుండా జాగ్రత్త పడండి. మాట్లాడేప్పుడు మీపై మీకున్న ఆత్మవిశ్వాసం మీ మాటలలో కనిపించేలా, తను నొచ్చుకోని విధంగా తన కళ్ల వైపు చూస్తూ మాట్లాడండి.. ఇక్కడే మీపై అమ్మాయి మదిలో ముద్రపడుతుంది...4.
పొగడ్తలంటే పడిపోని అమ్మాయిలుండరు. మీరు ఓ అమ్మాయితో ఉన్నపుడు తన గురించి మాత్రమే పొగడండి.. ఇంకో అమ్మాయిని పొగడటంకాని ఇంకొకరి ప్రస్తావన తేవడంకాని చేయవద్దు. 5.
ముబావంగా ఉండకండి.. నిశ్శబ్దమంటే పరమ చిరాకు చివరిగా అమ్మాయిలతో ముబావంగా, మాట్లాడకుండా సైలంట్‌గా ఉండకండి.. అలా అని మరీ ఎక్కువగా మాట్లాడవద్దు. అమ్మాయిని ఇంప్రెస్ చేసేందుకు తనకు ఏమంటే నచ్చుతాయో వాటి గురించే ఎక్కువగా మాట్లాడండి. మీ గురుంచి ఆలోచింపజేసేలా చేయండి. ఇక మీ డ్రీం గర్ల్ మీకు దొరికినట్లే.