Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దక్షిణాఫ్రికా ఎన్నికల ప్రచారానికి మున్నాభాయ్

Advertiesment
దక్షిణాఫ్రికా ఎన్నికల ప్రచారానికి మున్నాభాయ్
ఇటీవలనే రాజకీయాల్లోకి చేరిన బాలీవుడ్ నటుడు సంజయ్‌‌దత్ స్వదేశంలో ఓటర్లను ఆకర్షించేందుకు బదులుగా, వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో జరిగే ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అధికార పార్టీ తరపున ప్రచారం చేసేందుకు సన్నద్ధమయ్యారు.

ఈ మేరకు దక్షిణాఫ్రికాలో అధికారంలో ఉన్న ఏఎన్‌సీ ఆహ్వానం మేరకు ఏఫ్రిల్ 22న జరిగే ఎన్నికల ప్రచారానికి, పలు బహిరంగ సభల్లో ప్రసంగించేందుకుగానూ మున్నాభాయ్ ఒప్పుకున్నారు.

అందులో భాగంగానే... భారతీయులు ఎక్కువగా నివసించే డర్బన్‌లోని చాట్సోవర్త్ వద్ద ఏర్పాటు చేసే అతిపెద్ద ర్యాలీలో ఆదివారం పాల్గోనున్నారు. తన పర్యటనలో భాగంగా సంజయ్‌దత్ ఫోనిక్స్‌లోని మహాత్మాగాంధీ కేంద్రాన్ని సందర్శించనున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు.

సో... ఇంటగెలిచి రచ్చ గెలవాలని మన పెద్దలు చెప్పిన సామెతను తిరగరాసే పనిలో భాగంగా... మున్నాభాయ్ రచ్చగెలిచి, ఇంట గెలిచేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టారన్నమాట...!

Share this Story:

Follow Webdunia telugu