1330 సూక్తులను కలిగిన తిరుకురల్‌ను ఏడు సంవత్సరాల వయసు గల లావినశ్రీ ఏకధాటిగా ఆలపిస్తుంది. తన ప్రతిభాపాటవాలతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకోనున్న లావినశ్రీని జాతీయ ప్రతిభా పురస్కారం వరించింది.
2006 సంవత్సరానికి గాను అత్యంత ప్రతిభను కనపరిచే బాలలను జాతీయ పురస్కారాలకు ఎంపిక చేసే కమిటీ ఎమ్. లావినశ్రీని ఎంపిక చేసింది. నగరంలోని పాఠశాలలో లావినశ్రీ మూడవ తరగతి చదువుతున్నదని ఆమె తండ్రి కె.మునిసామీ తెలిపారు.
మూడు సంవత్సరాల వయస్సులోనే తిరుకురుల్ పట్ల మక్కువను పెంచుకున్న లావినశ్రీ, పలు సాహితీసభలలో తన ప్రతిభను చాటుకున్నదని మునిసామీ పేర్కొన్నారు. ఆమె అందుకున్న పురస్కారాలలో తమిళనాడు గవర్నర్ ఎస్.ఎస్.బర్నాలా మరియు తమిళ విభాగం అందించిన రూ. 5000 నగదు పురస్కారాలు కూడా ఉన్నాయి.
అంతేకాక మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, లావినశ్రీ ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసించారని ఆయన వెల్లడించారు.