Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక్కోసారి "ఇదీ" అని చెప్పలేని దిగులు.. ఎందుకు..?

Advertiesment
ఆరోగ్యం
, సోమవారం, 3 జనవరి 2011 (15:30 IST)
ఒక్కోసారి ఎటువంటి వారైనా నిద్ర లేస్తూనే నిస్సారంగా ఉన్నట్లు ఫీలవుతారు. ఇందుకు నిగూఢంగా ఉండే అనేక అంశాలు కారణం కావచ్చు. సంతోషాన్ని తెచ్చుకుందామని పదే పదే తలపోస్తూ, ఇంకొంచెం అసంతృప్తికి ద్వారాలు తెరుస్తుంటారు. అసలు ఇలా ప్రయత్నించడమే దిగులుకు దారి తీస్తుంది. ఏ ప్రయత్నం లేకుండా సాధ్యమయ్యేదే సంతోషం.

నచ్చిన పనిని చేయాలి. ఇష్టమైన ఆహారం తినాలి. సంగీతం వినడం, ప్రకృతిని వీక్షించండం, ఇష్టమైన వారితో కాసేపు మాట్లాడటం, ఇండోర్ గేమ్స్ ఆడటం, గార్డెనింగ్ వంటి అనేకానేక పనుల నుంచి సంతోషాన్ని దక్కించుకోవచ్చు. సంతోషంగా, మనసారా నవ్వుతూ కనిపించే వ్యక్తుల సమక్షాన్ని అందరూ కాంక్షిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu