Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక్కసారి అలవాటైతే... అతివలు పొగమానడం కష్టం.. పరిశోధన

Advertiesment
స్మోకింగ్
, సోమవారం, 9 ఏప్రియల్ 2012 (17:12 IST)
PTI
దమ్‌ మారో దమ్‌ అంటూ రెండు వేళ్ల మధ్య సిగరెట్‌లను చివరి దాకా ఏకబిగిన పీల్చి.. వాటి పీకలను కాళ్ల కింద నలిపేస్తున్న అతివల సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువైపోతోంది. మహిళలు ఒకసారి గనుక పొగతాగడానికి అలవాటుపడితే, దాని నుండి బయటపడే అవకాశాలు పురుషులతో పోలిస్తే తక్కువని ఒక పరిశోధనలో వెల్లడయింది. సిగరెట్లలోని నికోటిన్‌కు పురుషులతో పోలిస్తే మహిళల్లోని మెదళ్లు భిన్నంగా స్పందిస్తాయని పరిశోధకులంటున్నారు.

పొగతాగే వ్యక్తి మెదడులోని నికోటిన్ గ్రాహకాలు, నికోటిన్‌కు బాగా అలవాటుపడిపోతాయి. పొగ తాగినప్పుడు నికోటిన్ గ్రాహకాల సంఖ్య రెట్టింపవుతుంది. అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ విభాగం పరిశోధన ప్రకారం పొగ తాగే పురుషులతో పోలిస్తే, పొగతాగని వారి మెదళ్లలో నికోటిన్ గ్రాహకాల సంఖ్య అధికంగా ఉంటాయని తేలింది. ఆశ్చర్యకరంగా, పొగ తాగే మహిళల్లో కూడా పొగతాగని వారికి మాదిరిగానే నికోటిన్ గ్రాహకాలు కలిగి ఉన్నారు.

లైంగిక భిన్నత్వం ఆధారంగా మనం దీన్ని చూస్తే, చాలా పెద్ద బేధం కనిపిస్తుందని పరిశోధనలో పాల్గొన్న కెల్లీ కాస్‌గ్రోవ్ తెలిపారు. పురుషులతో పోల్చి చూసినపుడు, మహిళలు నికోటిన్‌తో సంబంధం లేని పొగ పీల్చినప్పుడు లేదా సిగరెట్‌ను రెండు వేళ్ల మధ్య ఉంచి, దాన్ని తాగకుండా వాసన చూసినా మహిళలు పొగతాగే అలవాటుకు సుళువుగా లోనవుతారని కాస్‌గ్రోవ్ తెలిపారు.

ఈ ఫలితాలు తమ వైద్య పరిశోధనల్లో కీలక పాత్ర వహించనున్నయన్నారు. పొగతాగడం మానేయాలని నిర్ణయించుకున్న వ్యక్తులకు ఇచ్చే చికిత్సల ఫలితాలు భవిష్యత్తులో నూటికి నూరు శాతం విజయవంతం అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ పరిశోధన వల్ల మహిళలు మరింత ప్రయోజనం పొందుతారని తెలిపారు. బిహేవియర్ థెరపీలు, వ్యాయామం, ఉపశమన చర్యలు, నికోటిన్ లేని మందుల ద్వారా మహిళల్లో పొగతాగే అలవాటును దూరం చేయవచ్చని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu