చక్కెర వ్యాధి గ్రస్తులకు మేలు చేసే బ్లాక్ టీ!
ఆధునిక కాలంలో చాలా మందికి షుగర్ వ్యాధితో బాధపడుతుంటారు. ఇందుకోసం ఎన్నో రకాలైన మందులు వాడుతున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే, లండన్‌కు చెందిన ఒక పరిశోధనా బృందం నిర్వహించిన సర్వేలో బ్లాక్ టీ సేవనంతో షుగర్ వ్యాధి గ్రస్తులకు కొంతమేరకు ఉపశమనం లభిస్తున్నట్టు కనుగొన్నారు. బ్లాక్ టీలో ఉండే కొన్ని రకాలైన రసాయనాలు చక్కెర వ్యాధిని కంట్రోల్ చేస్తున్నట్టు తేల్చారు. అయితే, ఈ బ్లాక్ టీని కూడా మోతాదుకు మించి సేవించరాదని సలహా ఇస్తున్నారు. మోతాదుకు మించి సేవించినట్టయితే, దాని వల్ల దుష్పరిణామాలు చేకూరే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.