Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తలనొప్పికి పుదీనా ఆకులతో ముద్ద

Advertiesment
తలనొప్పికి పుదీనా ఆకులతో ముద్ద
, సోమవారం, 20 ఆగస్టు 2012 (15:51 IST)
FILE
మద్యప్రాచ్యం, భారత్, యూరప్‌లలోని ప్రాచీన సంస్కృతిలో పుదీనాను వంటకాలలోనూ, ఔషధ పరంగాను విస్తృతంగా వినియోగించేవారు. పుదీనాకు మంచి వాసనే కాకుండా రుచి, ఔషధ శక్తి ఉన్నాయని గుర్తించారు. సలాడ్లు, పానీయాల్లో పుదినాను విస్తృతంగా ఉపయోగించవచ్చు. పుదీనాతో చేసిన టీతో అనేక ప్రయోజనాలున్నాయి.

చూయింగ్ గమ్, టూత్ పేస్ట్, మరెన్నో మందుల్లో ఎలా వాడినా పుదీనా తాజాదనాన్ని చక్కగా అందిస్తుంది. ఇంకా మాంగనీస్, విటమిన్ ఎ, విటమిన్ సి ఇందులో పుష్కలంగా లభిస్తాయి. పీచు, ఫోలేట్ ఐరన్, మేగ్నీషియం క్యాల్షియం, విటమిన్ బి2, ఒమెగా-3 ఫ్యాటి యాసిడ్స్, పొటాషియం, కాపర్ లభిస్తాయి.

పుదీనా ఆకులు, నూనె, విత్తనాలు, ఇతర భాగాలు అనేక రకాల వ్యాధులకు నివారిణిగా పనిచేస్తాయి. ఆయుర్వేద వైద్య సలహాను అనుసరించి మాత్రమే పుదీనాను ఆయా వ్యాధుల నివారణకై ఉపయోగించాలి.

తలనొప్పి: పుదీనా ఆకులు ముద్దగా చేసి నుదిటిపై వేయాలి. ఆకులు నలిపి వాసన చూడాలి.

జుట్టు ఊడటం, పేలు: పుదీనా ఆకులు పేస్ట్‌ను రాత్రి తలకు పట్టించాలి. పొద్దుటే స్నానం చెయ్యాలి.

దగ్గు జలుబు: పుదీనా కషాయం రోజు 2 సార్లు తాగాలి.

గొంతునొప్పి: పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలించాలి. ఎండిన ఆకుల పొడుముతో పళ్లు తోముకోవాలి.

దంతవ్యాధులు: పుదీనాతో చేసిన మెంథాల్ దంత వ్యాధులపై మంచి ప్రభావం చూపిస్తుంది. ప్రతి రోజు ఆకులు బాగా ఎక్కువసేపు నమిలి తినాలి.

పిప్పి పళ్ళు: పిప్పరమెంట్ నూనెతో లవంగ నూనె కలపాలి. ఆ మిశ్రమంలో దూదిని తడిపి పెడితే పిప్పి పళ్ళు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

ముఖంపై మొటిమలు: పుదీనా నూనె మొటిమల పైన రాసినట్లయితే అవి తగ్గిపోతాయి. స్వరపేటిక ఆరోగ్యానికి పుదీనా రసం తాగాలి.

Share this Story:

Follow Webdunia telugu