Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వక్షోజాలు చిన్నవిగా ఉన్నాయి.. పెద్దవయ్యేందుకు మార్గం..?

Advertiesment
వక్షోజాలు
WD
కొంతమంది ఎంత తిన్నా సన్నగా ఉండి స్తనాలు చిన్నవిగా ఉంటాయి. ఇటువంటి వారు తామర గింజలను పాలతో నూరి దాంట్లో పంచదార కలుపుకుని రోజూ తాగుతూ ఉంటే నెల రోజుల్లో వక్షోజాలు చక్కని ఆకృతులను సంతరించుకుంటాయి.

ఇక కొంతమందిలో అంటే.. ముఖ్యంగా పెళ్లైన స్త్రీలలోనూ, లావుగా ఉండి పెళ్లికాని వారిలోనూ స్తనాలు లావై జారి మెత్తగా ఉండిపోతాయి. అటువంటివారు తెల్ల తామర పువ్వు, నల్ల ఆవుపాలు కలిపి ముద్దగా నూరుకుని రోజూ రాత్రిపూట, ఉదయం వేళ మర్దన చేసుకుంటే అవి గట్టిపడి స్థిరంగా ఉంటాయి.

అంతేకాదు మనం తిని వదిలేసే దానిమ్మ బెరడు ప్రకృతి ప్రసాదించిన అద్భుత స్తనవృద్ధి ద్రవ్యం. దానిమ్మ బెరడు ముక్కలు, జమ్మి కాయలు, దొండపట్ట.. వీటన్నిటినీ కలిపి నూరి పైన కొంచెం, కింద ఎక్కువసేపు మర్దన చేసుకుని పడుకుంటే అవి గట్టిపడతాయి.

అదేవిధంగా అశ్వగంధ చూర్ణ, పిప్పళ్లు, చెంగల్వ కోష్టు, వసలను గేదె వెన్నతో బాగా నూరి మర్దన చేసుకుంటే చక్కటి స్తన సౌందర్యం ఒనగూరుతుంది.

కొంతమందికి హార్మోన్ల లోపం వల్ల కూడా స్తన వృద్ధి సమస్య తలెత్తుతుంది. కనకు ప్రతిరోజూ మొదటి ముద్దలో నువ్వుల పొడిని వేసుకుని తినడం, వారంలో రెండు సార్లయినా మినప గారె టిఫిన్ తినడం బాగా ఉపకరిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu