మధుమేహ వ్యాధితో బాధపడే వారు మధుపత్రి (స్టీవియా) ఆకులను ప్రతి రోజు నమిలి తింటుంటే మధుమేహ వ్యాధి మటుమాయమౌతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. దీనిని ఇంగ్లీషులో స్టీవియా అని అంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తీపి పదార్థాలు తినేందుకు వెనుకాడుతుంటారు. కాని తీపి పదార్థాలను తిన్న తర్వాత మధుపత్రిని నమిలితే శరీరంలో చక్కెర శాతం అదుపులో వుంటుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
మధుపత్రి ఆకుల్లో చెరకు కన్నా మూడింతల తీపు వుంటుంది. భోజనం చేసే ఇరవై నిమిషాల ముందు మధుపత్రి (స్టీవియా) ఆకులను నమిలితే ఫలితం ఉంటుంది. ఈ మొక్కలను ఇంట్లోను పెంచుకోవచ్చు. మధుపత్రి ఇన్సులిన్‌ను విడుదల చేయడంలో ప్రధానపాత్ర వహిస్తుంది. మధుపత్రి సేవిస్తుంటే మధుమేహ వ్యాధితోపాటు రక్తపోటు, హైపర్ టెన్షన్, దంతాలు, గ్యాస్, కడుపులో మంట, గుండె జబ్బులు కలవారు, చర్మ వ్యాధులు కలవారు, ముఖంపై ముడతలు పడటం నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.